నియమం- అన్యదేవతలను నమస్కరించవద్దు
ఈ నియమ ఉల్లంఘన వలన ఒక స్త్రీ చనిపోతుంది. అది ఎలాగో చూడండి
యెహోవా ఆజ్ఞ:
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి #సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు (నిర్గమకాండము 20:4-5)
You shall #not #bow down to them or worship them; for I, the LORD your God, am a jealous God, punishing the children for the sin of the fathers to the third and fourth generation of those who hate me. (Exodus 20:5)
అన్యదేవతారాధన చేసిన స్త్రీలు
ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు #నమస్కరించిరి. (సంఖ్యాకాండము 25:2)
who invited them to the sacrifices to their gods. The people ate and #bowed down before these gods. (Numbers 25:2)
అన్యదేవతారాధన చేసిన వారిని ఉరి తీసి చంపేయమన్న యెహోవా
అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను. (సంఖ్యాకాండము 25:3-4)
So Israel joined in worshipping the Baal of Peor. And the LORD-s anger burned against them.
The LORD said to Moses, “Take all the leaders of these people, kill them and expose them in broad daylight before the LORD, so that the LORD-s fierce anger may turn away from Israel. (Numbers 25:3-4)
అన్యదేవతారాధన చేసిన స్త్రీని లాక్కొచ్చిన యెహోవా అనుచరుడు
ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదు టను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను. (సంఖ్యాకాండము 25:6)
ఆ స్త్రీని ఈటెతో పొడిచి చంపిన మరో యెహోవా అనుచరుడు:
యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి, సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను. (సంఖ్యాకాండము 25:7-8)
స్త్రీని పొడిచిన వాడిని మెచ్చుకున్న యెహోవా
వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. (సంఖ్యాకాండము 25:11-12)
అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. (సంఖ్యాకాండము 25:13)
నోట్:
అన్యతేవారాధన చేసే వాళ్ళను చంపడం యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. అది నెరవేర్చి యెహోవా మన్నన పొందాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఈ సంఘటన సెక్కులరిజానికి అత్యంత ప్రమాదకరమైన సందేశాన్ని అందిస్తుంది.