Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యెహోవా నియమాలు -2

దేవుడు ఉన్నాడు అని నమ్ము. అది నేనే.

నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. (నిర్గమకాండము 20:2)

“I am the LORD your God, who brought you out of Egypt, out of the land of slavery. (Exodus 20:2)

ఈ వాక్యంలో ఒక నియమం దాగి ఉంది.

“యెహోవాయే దేవుడు” అని నమ్మమని యెహోవాయే చెప్తున్నాడు. కాబట్టి అందరూ నమ్మాలి.

అలా కాకుండా “దేవుడే లేడు” అని వాదించినా ఆ “దేవుడి ఉనికిని ప్రశ్నించినా” మీకు మరణ శిక్ష తప్పదు.

యెహోవా నేను దేవుడిని అని చెప్తున్నాడు కాబట్టి నాస్తికులు ఎవరైతే దేవుడే లేడు అంటారో వారు ఖచ్చితంగా శిక్షార్హులు.

నాస్తికులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?

  1. మరణ శిక్ష

యెహోవాని అనుమానించిన అవిశ్వాసి

ఆ యధి పతియెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడునీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను. (2 రాజులు 7:19)

తొక్కిసలాటలో మృతి చెందిన అవిశ్వాసి

జనులు ద్వార మందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. (2 రాజులు 7:20)

వివరణ:

ఒకసారి దేశంలో పెద్ద కరువు వస్తుంది. జనం తిండి లేక అలమటిస్తూ ఉంటారు. ధరలు మండుతాయి. ఒక సందర్భంలో ఎలీషా ప్రవక్త” రేపటి నుండి ధరలు తగ్గుతాయి అని చెప్తాడు. అయితే ఒక అధికారి ” దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా అది జరుగునా అంటాడు. అప్పుడు ప్రవక్త అవిశ్వాసితో అది జరుగుతుంది కానీ నువ్వు ఉండవు రా అబ్బాయి అంటాడు. దేవుడు తొక్కిసలాట జరిగేలా చేస్తాడు. అప్పుడు అవిశ్వాసి మరణిస్తాడు. ఆ విధంగా అవిశ్వాసికి శిక్ష పడింది.

  1. నాస్తికులకు రెండో మరణం (నరకం)

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన గ్రంథం 21:8)

But the cowardly, the unbelieving, the vile, the murderers, the sexually immoral, those who practise magic arts, the idolaters and all liars–their place will be in the fiery lake of burning sulphur. This is the second death. (Revelation 21:8)

కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ దేవుడు యెహోవాయే అని నమ్మాలి.

అలా నమ్మని అవిశ్వాసులు, ఇతర దేవతలను పూజించే వాళ్లు ఖచ్చితంగా నరకానికి పోతారు. యెహోవా భక్తులను మతం మార్చాలని చూస్తే చంపేయండి అని మరో నియమం ఉంది కాబట్టి భూలోకంలో కూడా ప్రమాదమే. సో ఛాయస్ ఐస్ యువర్స్.

యెహోవాయే దేవుడు అని నమ్మండి. లేదా చావండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *