Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

విశ్రాంతి దిన నియమం – పాటించకపోతే మరణశిక్ష

హైలైట్స్:

  1. శనివారం రోజున పని చెయ్యరాదు. పని చేస్తే మరణ శిక్ష

ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును. (నిర్గమకాండము 35:2)

  1. శనివారం రోజున వంట చేసుకోరాదు.

విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను. (నిర్గమకాండము 35:3)

  1. శనివారం రోజున ప్రయాణం చేయరాదు.

చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను. (నిర్గమకాండము 16:29)

  1. శనివారం రోజున అదనపు గొర్రెలు బలివ్వాలి

విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను. (సంఖ్యాకాండము 28:9)

  1. శనివారాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. గుర్తుపెట్టుకోవాలి

విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. (నిర్గమకాండము 20:8)

  1. విశ్రాంతి దినం నిత్యకట్టడి

ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. (నిర్గమకాండము 31:16)

శిక్ష అమలు జరిగిన సందర్భం:

విశ్రాంతి దినం పాటించని వ్యక్తిని చంపేయమన్న యెహోవా మాట విని ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసిన మోసే అనుచరులు

వ్వక్తి చేసిన తప్పులు:

విశ్రాంతి దినం రోజున నిప్పురాజేయడానికి (వంట చేయడానికి) కట్టెలు ఏరుకోవడం. శనివారం రోజున పని చేసి యెహోవా మాటను ధిక్కరించడం.

శిక్ష అమలు జరిగిన సందర్భం:

( సంఖ్యాకాండం 15:32 నుండి 15:36)

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. (సంఖ్యాకాండము 15:32)

వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. (సంఖ్యాకాండము 15:33)

వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.(సంఖ్యాకాండము 15:34)

తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. (సంఖ్యాకాండము 15:35)

సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. (సంఖ్యాకాండము 15:36)

గమనిక:

అన్ని నియమాల కంటే శనివారం విశ్రాంతి దినం ఆజ్ఞ అత్యంత వివరంగా ఇవ్వబడింది. యూదులు ఈ నియమాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. శనివారం ఇజ్రాయిల్లో ఇప్పటికీ సెలవు దినం.

1 thought on “యెహోవా నియమాలు -3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *