
యెహోవా నియమావళి ప్రకారం ప్రతి మగబిడ్డకు అతను పుట్టిన 8 వ రోజున సున్నతి చేయించాలి.
ఇది యెహోవా భక్తులు అందరికీ వర్తిస్తుంది.
ప్రతి మగబిడ్డకు 8వ రోజున సున్నతి చేయించాలి
మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. (ఆదికాండము 17:11)
And ye shall circumcise the flesh of your foreskin; and it shall be a token of the covenant between Me and you. (Genesis 17:11)
ఈ నియమాన్ని ఇజ్రాయెల్ వాళ్లే కాకుండా ఇజ్రాయెల్ వారి ఇంట్లో ఉంటే బానిసలు, పనివాళ్ళు కూడా ఆచరించే వాళ్లు.
కాబట్టి ఇది చాలా ప్రధానమైన నియమం.
అయితే ఈ నియమాన్ని మీరడం మరణశిక్ష కు దారితీయవచ్చు అని బైబిల్ చూస్తే అర్ధం అవుతుంది.
కొడుక్కి సున్నతి చేయలేదని మోసేను చంపబోయిన యెహోవా, అత్యవసర సున్నతి చేసి కాపాడిన భార్య
అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను. (నిర్గమకాండము 4:24-26)
ఇక్కడ మోసే భార్య మోసే చేసిన పొరపాటుని సరిచేసి ఉండకపోతే మోసేను కూడా యెహోవా చంపేసి ఉండేవాడు.
కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు సున్నతి ఆచారాన్ని చాలా నిష్టతో ఆచరిస్తారు