Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

విగ్రహారాధన చేయకూడదు

పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. (నిర్గమకాండము 20:4)

“You shall not make for yourself an idol in the form of anything in heaven above or on the earth beneath or in the waters below. (Exodus 20:4)

పై వాక్యంలో యెహోవా ఇజ్రాయెల్ ప్రజలను విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పాడు. ఈ ఆజ్ఞ మీరు విగ్రహారాధన చేసే వాళ్ళను చాలా తీవ్రంగా శిక్షిస్తాడు. దీనికి ఈ క్రింది ఉదాహరణ చూడండి.

విగ్రహారాధన చేసిన తండ్రి. కొడుకుని చంపేసిన యెహోవా

విగ్రహారాధన చేసిన రాజు:

ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. (1 రాజులు 12:28)

మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను. (1 రాజులు 12:31)

నీ కంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసి యున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి యున్నావు. (1 రాజులు 14:9)

యెహోవాకు కోపం వచ్చింది

ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.(1 రాజులు 14:15)

కొడుకుని చంపేసిన యెహోవా:

కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును. (1 రాజులు 14:12)

అప్పుడు యరొ బాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను. (1 రాజులు 14:17)

Then Jeroboam-s wife got up and left and went to Tirzah. As soon as she stepped over the threshold of the house, the boy died. (1 Kings 14:17)

ఇంకా ఉన్నాయి శిక్షలు

మీ వాళ్ళ శవాలను కుక్కలు, రాబందులు తింటాయి.

పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.(1 రాజులు 14:11)

Dogs will eat those belonging to Jeroboam who die in the city, and the birds of the air will feed on those who die in the country. The LORD has spoken!-(1 Kings 14:11)

గమనిక:

విగ్రహారాధన చేసిన వాళ్ళ పిల్లలను చంపుతూ, విగ్రహారాధన చేసిన వాళ్ళను చంపి వారి మాంసాన్ని ఆకాశ పక్షులకు, కుక్కలకు వేస్తూ విగ్రహారాధన అంటే భయపడేలా చేశాడు యెహోవా. కాబట్టి విగ్రహారాధన అనేది ఇజ్రాయెల్ ప్రజలకు నిషేధం అని అర్ధం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *