
అహరోను కుటుంబ సభ్యులు (మోసే అన్న కుటుంబ సభ్యులు) మాత్రమే యాజకత్వము చెయ్యాలి. ఇతరులు యాజకత్వము కోరితే వారిని చంపేయాలి.
మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. (నిర్గమ కాండం 28:1)
నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. (సంఖ్యా కాండం 3:10)
యాజకత్వము కోరిన కోరహు వర్గము:
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనెను. (సంఖ్యా కాండం 16:3)
అహరోను కుటుంబం కాకుండా ఇతరులు యాజకత్వము కోరడం తగదు అన్న మోసే
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు. (సంఖ్యా కాండం 16:10)
250 మందిని చంపేసిన యెహోవా :
మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. (సంఖ్యా కాండం 16:17)
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. (సంఖ్యా కాండం 16:32)
గమనిక: అహరోను కుటుంబ సభ్యులు మాత్రమే యాజకత్వం చేయాలి అనే నియమం యేసు కాలం వరకు కొనసాగింది. యోహాను అహరోను వంశంలో వాడు. అతను యేసుకి బాప్టిజం ఇచ్చాడు.