
బుర్రలేని గొర్రెల కథ!
బైబిల్ ప్రకారం యెహోవా/ యేసు ఇద్దరూ మంచి గొర్రెల కాపరులు. అయితే వాళ్లు నిజంగానే మంచి కాపరులా కాదా? కాపరి అంటే కాపాడే వాడా? గొర్రెలని చంపేవాడా?
ఈ రిఫరెన్స్ చూడండి.
యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1
ఈ రిఫరెన్స్ చూసిన ఎవరైనా సరే.. గొర్రె అనేది క్రైస్తవులకి ఒక పవిత్రమైన జంతువేమో.. యెహోవాకి, యేసుకి గొర్రెలంటే అమితమైన ప్రేమేమో అనే భ్రమ కలుగుతుంది.
కాని నిజానకి గొర్రె అనేది బైబిల్ లో ఒక బలి పశువు. బైబిల్ లో గొర్రెని ప్రత్యేకంగా చూడటానికి కారణం యెహోవాకి ప్రతి అమావాస్యకు బలిచ్చే జంతువుల్లో గొర్రె అత్యంత చవకైనది. దాన్ని పెంచడం, మేపడం, బలిచచ్చేయడం చాలా సులువు కాబట్టి.
ఇక బైబిల్ లో గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి ఏం రాసుందో 5 పాయింట్స్ లో చూద్దాం.
- బైబిల్లో మొదటి గొర్రెల కాపరి – హేబేలు.
ఆదికాండము 4:2
తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
భూమి మీద మొదటి జంట అని బైబిల్ లో చెప్పబడే హవ్వ ఆదాముల ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు. విచిత్రంగా భూమి మీద నలుగురు మనుషులు (హవ్వ, ఆదాము, కయూను, హేబేలు ) ఉన్నప్పుడే హేబేలు గొర్రెల కాపరి అవతారం ఎత్తాడు. యెహోవా కి మొదటి కొవ్విన గొర్రెను దహన బలి ఇచ్చింది ఇతనే. అంటే మొదటి గొర్రెని యెహోవా కోసం చంపింది కూడా హేబేలే.
గొర్రెలని మనుషులు చేసిన పాపాల కోసం చంపడం ఇక్కడే మొదలయింది.
- గొర్రెలని చంపి, దాని బాడీ ని ఏ పార్టుకి ఆ పార్టు ఊడదీసి యెహోవా కి దహన బలి ఇవ్వాలి. మరి యెహోవా మంచి గొర్రెల కాపరి ఎలా అవుతాడు?
లేవీయకాండము 1:10 -13
దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెలయొక్కగాని మేకలయొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.
- గొర్రెని చంపి దాని రక్తాన్ని గదాపు పూస్తేనే యెహోవా బతకనిస్తాడు.
నిర్గమకాండము 12:2 – 8
నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో-ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను.
- యెహోవా మందలో చేరిన గొర్రెలని చెదరగొడితే యెహోవా కి కోపం వస్తుంది. ఎందుకు? అమావాస్య రోజు గొర్రెలు కావాలి కదా బలి ఇవ్వడానికి!
యిర్మియా 23:1
యెహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
- గొర్రెలని చంపి తాగాలబెడుతుంటే వచ్చే వాసన యెహోవా ఇష్టం.
లేవీయకాండము 23:18
మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రజలారా?
యెహోవా మంచి కాపరా? మంచి కాపరి గొర్రెలని చామపమని చెప్తాడా? గొర్రెలని చంపి తగలబెడుతుంటే ఆ వాసనని ఇంపుగా ఉందని చెప్తాడా?
అయినా సరే గొర్రెలు కసాయి వాడినే నమ్ముతాయి. ఎందుకు అంటే గొర్రెలు కాబట్టి.