బైబిల్ పిట్ట కథ – కట్టు కథ
ఒకప్పుడు భూమి పైన అందరూ ఒకే భాష మాట్లాడేవారంట. వారు కడుతున్న ఆకాశాన్ని తాకే భవనం ఒకటి కట్టాలని చూశారంట. దేవునికి కోపం వచ్చి వారి ప్రయత్నాన్ని భగ్నం చేశాడంట. అప్పుడే అనేక భాషలు ఏర్పడ్డాయంటే. ఇంకా వివరంగా తెలియాలంటే ఈ కథ చదవండి.
భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. (ఆదికాండము 11:1-3)
మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. (ఆదికాండము 11:4-5)
అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు.ఇకమీదట వారు చేయదలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. (ఆదికాండము 11:6)
గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.(ఆదికాండము 11:7)
ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి. (ఆదికాండము 11:8)
దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను. (ఆదికాండము 11:9)
చూశారు కదా ఈ పిట్ట కథని.
ఈ పిట్ట కథలో ఉన్న బొక్కలు ఇప్పుడు చూద్దాం
- భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. (ఆదికాండము 11:1)
ఇక్కడ భూమి అంతా ఒకటే భాష ఉండేది అని రాసి ఉంది కదా. నిజానికి అంతక ముందే అనేక భాషలు ఉన్నాయని బైబిల్ చెప్తోంది.
వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, #వారివారి #భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి. (ఆదికాండము 10:5)
From these the maritime peoples spread out into their territories by their clans within their nations, each with its own language. (Genesis 10:5)
వీరు తమతమ వంశముల ప్రకారము #తమతమ #భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. (ఆదికాండము 10:20)
These are the sons of Ham by their clans and languages, in their territories and nations. (Genesis 10:20)
వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు. (ఆదికాండము 10:31)
These are the sons of Shem by their clans and languages, in their territories and nations. (Genesis 10:31)
కాబట్టి భూమి అంతటా ఒకటే భాష ఉండేది అన్న ఈ కథలోని వాదన. పిచ్చ వాదన. ఇది ఒక కట్టు కథ. పిట్ట కథ
- సర్వాంతర్యామి అయిన దేవుడు ఆ గోపురాన్ని చూడటానికి వచ్చాడు అని రాసి ఉంది గోపురమును చూడ దిగి వచ్చెను. (ఆదికాండము 11:4-5)
అంటే యెహోవా అనే బైబిల్ దేవుడు సర్వాంతర్యామి కాదు అని అర్ధం చేసుకోవాలా?
- వేరు వేరు ప్రాంతాలకు చెదరగొట్టబడితే కొత్త భాషలు వచ్చేస్తాయా?
అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు ఇప్పటికీ తెలుగే ఎందుకు మాట్లాడుతున్నారు?
కాబట్టి బైబిలులోని ఈ బాబెల్ గోపురం కథ ఒక కట్టు కథ. పిట్ట కథ.
మరో పిట్టకథతో మళ్ళీ కలుద్దాం.