కొందరు మాత్రమే విని అర్ధం చేసుకొని వాళ్ళు మాత్రమే పాపక్షమాపణ పొందాలని యేసు కోరుకుంటే, మరి యేసు అందరి కోసం చనిపోయాడు అనే మాటలో అర్ధం ఉందా ?
మార్కు 4:12
వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను.
Mark 4:12
so that, “`they may be ever seeing but never perceiving, and ever hearing but never understanding; otherwise they might turn and be forgiven!-“
అంటే కొందరు మాత్రమే తన వాక్యం వినాలని ఏసు కోరుకున్నాడు.
యేసు వాక్యం వింటే ఏం అవుతుందిట?
“otherwise they might turn and be forgiven!”
“ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని”
అదేమిటి, అందరికి తన వాక్యం చేరాలని యేసు కోరుకోలేదు?
ఒకసారి కొంచెం ముందు వాక్యాలు చూద్దాం
మార్కు 4:1-10
ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
మార్కు 4:11-12
అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను.
ఇప్పుడు అర్ధం కదా!
మార్కు 4:1 లో చెప్పబడిన గుంపు లోని జనాలకి అర్ధం కాకుండా చెప్పను ఎందుకంటే దేవుని రాజ్యం చేరడానికి మీకు మాత్రమే అనుదురహం ఉంది అని .
ఇంతకు మిగతా గుంపు అంతా ఎందుకు అనుగ్రహం పొందలేదంట?
వారు పుట్టిన నేల వలన. విత్తనాలు వేసే వాడు కరెక్ట్ గా వేసినా అవి పడాల్సిన సరిగా లేనప్పుడు ఫలితం ఉండదు అని యేసు చెప్తున్నాడు.
తాను ఇశ్రాయేలు వారై తప్పిపోయిన గొర్రెల వద్దకే వచ్చాను అని మరో చోట చెప్పిన మాటకి దీనికి లంకె ఉంది.
అయితే తన వాక్యం వింటే వాళ్ళు పాపక్షమాపణ పొందుతారు.
ఆలా పొందకుండా ఉపమానాలతో వాళ్ళని పాపక్షమాపణకు దూరం చెయ్యడం అంటే యేసు చావు కూడా అందరి కోసం కాదు అని అర్ధం చేసుకోవాలి.