పాస్టర్లు చెప్పని బైబిల్ వాక్యాలు -9 దేవుడ్ని చట్టం పనికిరానిది అయ్యింది !!! useless law of god

దేవుని చట్టం (ధర్మ శాస్త్రం) పనికిరానిది అయ్యింది !!!

ధర్మ శాస్త్రం అంటే ఏమిటి?

బైబిల్ దేవుడు మోషేతో చేసుకున్న నియమావళిని క్రైస్తవులు ధర్మ శాస్త్రం అంటారు. దీనిని ఆధారం చేసుకుని యూదులు, క్రైస్తవులు జీవించే వారు. కాలక్రమేణా దీనికి నీళ్లొదిలేశారు క్రైస్తవులు. యెహోవా పెట్టిన నియమాల్లో 10 కమాండ్మెంట్స్ అనబడే 10 ఆజ్ఞలు తో పాటు మరికొన్ని ఆజ్ఞలు కలిపి వాటికీ పెట్టబడిన పేరు ధర్మశాస్తం.

ఒకప్పుడు ధర్మ శాస్త్రం గొప్పతనం గురించి ఎన్నో పొగడ్తలు (కీర్తనలు) రాసుకున్నారు.

  1. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. (కీర్తనల గ్రంథము 119:142)

Your righteousness is everlasting and your law is true. (Psalms 119:142)

  1. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. (కీర్తనల గ్రంథము 119:127)
    Because I love your commands more than gold, more than pure gold (Psalms 119:127)

ఈ ధర్మ శాస్త్ర పొగడ్తలకు అంతే లేదు.

అందుకే దేవుడు మోషేతో చేసుకున్న ధర్మ శాస్త్రం అనబడే నియమావళకి పాతనిబంధన కాలంలో ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. యూదులు ప్రతి నియమాన్ని తు.చ. తప్పకకుండా పాటించేవారు. కాదని ఎదురించినవాడి వాడి తలా నరికేసేవారు.

ధర్మ శాస్త్రం పేరుతో జరిగిన ఘోరాలు, కొన్ని ఉదాహరణలు:

  1. శనివారం పనిచేసిన మనిషిని చంపేశారు.
  2. దైవ దూషణ చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపారు.
  3. ఇతర దేవతా ఆలయాలను తగలబెట్టారు, కూల్చారు, భక్తులను చంపారు. గుళ్లను మరుగుదొడ్లుగా మార్చారు.

ఇలాంటి ఘోరాతి ఘోరమైన శిక్షలు, హింస యెహోవా పెట్టిన నియమాల పేరుతో జరిగినట్టు, కొన్ని సార్లు యెహోవానే దగ్గర ఉండి చేయించినట్టు బైబిల్ లో రాసుకున్నారు.

అంతా సజావుగా సాగుతున్న సమయంలో సడన్ గా దేవుడి న్యాయశాస్త్రం పనికి రానిది (నిష్ప్రయోజనకరమైనది) అంటూ కొత్త ప్రకటన వచ్చింది . పాత దానివలన ఎవడికి ఉపయోగం కలగలేదు. అందుకే ఆ useless law బదులుగా కొత్త చట్టం వచ్చింది అంటూ కొత్త వాదన మొదలయ్యింది. దానిపేరు క్రైస్తవం.

ఆ #ధర్మశాస్త్రము దేనికిని #సంపూర్ణసిద్ధి #కలుగజేయలేదు గనుక #ముందియ్యబడిన #ఆజ్ఞ #బలహీనమైనందునను #నిష్‌ప్రయోజన మైనందునను అది #నివారణ చేయబడియున్నది. అంత కంటె #శ్రేష్ఠమైన #నిరీక్షణ దానివెంట #ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.(హెబ్రీయులకు 7:18-19)

The f#ormer regulation is #set #aside because it was #weak and #useless. for the #law made #nothing perfect), and a #better #hope is introduced, by which we draw near to God. (Hebrews 7:18-19)

ధర్మ శాస్త్రాన్ని కొట్టివేయడంతో పాటు దానిపై నిందలు కూడా మోపారు క్రైస్తవులు.

ఒకప్పుడు నీతివంతమైనది అనిపించుకున్న ధర్మశాస్త్రం, ప్రజలను నీతిమంతులని చేయలేకపోయింది అన్నారు.

మీరు #మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో #నీతిమంతులుగా #తీర్చబడలేకపోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక… (అపో. కార్యములు 13:39)

ఒకప్పుడు మనుషుల ప్రాణాలను సైతం తృణప్రాయంగా తీసేసిన ధర్మ శాస్త్రం ఛాయ అంటే కేవలం నీడ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల #ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు. (హెబ్రీయులకు 10:1)

దేవుడు చెప్పిన మాట ఒకప్పుడు న్యాయమైనది, సత్యమైనది నీతివంతమైనది. ఇప్పుడు నిష్ప్రయోజనకారైనది, నీతిమంతులుగా చేయలేనిది, కేవలం ఛాయ మాత్రమే అయిపోయింది.

మరి దానిపేరుతో దేవుడు మరియు అతని భక్తులు చేసిన హత్యలు, చచ్చిన మనుషులు, వరదలా పారిన మనుషుల + మనుషుల రక్తం ?

దీనికి ఎవరు సమాధానము చెప్తారు ?

useless law ఇచ్చి మనుషులను ఇన్నాళ్లూ చంపింది దేవుడు కాదా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *