వేదం చదివే వాడిని బ్రాహ్మణుడు అంటారు
పాలన చేసేవాడిని క్షత్రియుడు అంటారు
వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అంటారు .
సేవ చేసే వాడిని శూద్రుడు అంటారు. అంతే తప్ప ఇవి రిజర్వేషన్స్ కాదు. ఇవి మనుషుల occupations. అంటే వృత్తులు.
వర్ణం అంటే ఏమిటో కనీశం అవహగానలేని అనేక మంది వీటిపై తమ సొంత వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వాటిని నమ్మి మోసపోవద్దు.
వర్ణం పుట్టుకతో వస్తుందా?
పుట్టుకతో వచ్చే ఒకే ఒక వర్ణం శూద్ర వర్ణం. జ్ఞాన లేకుండా తల్లి గర్భం నుండి వచ్చే శిశువు శూద్రుడు. విద్యాభ్యాసం(వేద విద్య + వృత్తి విద్యలు ) తరవాత అతనికి వచ్చే మూడు ఉన్నత వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య వర్ణాలు.
- వర్ణాలు ఎన్ని ? పంచమ వర్ణం అని ఏదైనా ఉందా?
ब्राह्मणः क्षत्रियो वैश्यस्त्रयो वर्णा द्विजातयः ।
चतुर्थ एकजातिस्तु शूद्रो नास्ति तु पञ्चमः ॥ ४ ॥
brāhmaṇaḥ kṣatriyo vaiśyastrayo varṇā dvijātayaḥ |
caturtha ekajātistu śūdro nāsti tu pañcamaḥ || 4 ||
మనుస్మృతి 10.4: బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య మూడు రెండుసార్లు జన్మించిన వర్ణాలు; నాల్గవది ఒక వర్ణం శూద్ర; ఐదవది లేదు.
అంటే పుట్టుకతో అందరూ శూద్రులే. రెండో జన్మ అనబడే విద్యాభ్యాసం(వేద విద్య + వృత్తి విద్యలు) తర్వాత ద్విజులు అవుతారు. ఉన్నతమైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు పొందుతారు. ద్విజులు అంటే విద్యాభ్యాసం అనబడే రెండో జన్మ పొందిన వారు.
- వర్ణం మార్చుకోవచ్చా ? అంటరానివారు, దళితులు ఇలాంటి ఫేక్ వర్ణాలు పంచమ వర్ణం లేనే లేవు.
అవును వర్ణాలు మార్చుకోవచ్చు.
शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्चैति शूद्रताम् ।
क्षत्रियाज् जातमेवं तु विद्याद् वैश्यात् तथैव च ॥ ६५ ॥
śūdro brāhmaṇatāmeti brāhmaṇaścaiti śūdratām |
kṣatriyāj jātamevaṃ tu vidyād vaiśyāt tathaiva ca || 65 ||
మనుస్మ్రుతి 10.65 : శూద్రుడు బ్రాహ్మణ స్థానానికి చేరుకుంటాడు మరియు బ్రాహ్మణుడు శూద్ర స్థానానికి మునిగిపోతాడు; క్షత్రియ లేదా వైశ్య సంతానం విషయంలో కూడా అదే అర్థం చేసుకోవాలి.
- పుట్టుకతో అందరూ శూద్రులే అని ఎలా చెప్తారు ?
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
Skanda Purana Vol. 18 Book VI , Nagar Kanda , Chapter 239 , Verse 31-34
పైన ఇచ్చిన సంస్కృత వాక్యాల ప్రకారం యే మనిషి పుట్టుకతో రాజు కాదు అందరూ బంటులే.
ఈరోజు మనం కొట్టుకు చస్తున్న కులం అనే మాటకి అర్ధం కూడా లేదు అని ఈ వాక్యాలు నిరూపిస్తున్నాయి.
ఎందుకు అంటే అందరూ సమానమే అంటుంది ఈ వాక్యం.
- విద్యాభ్యాసం అవకుండా వెడలు చదవకూడదా ?
అవును. వేదాభ్యాసం అవకుండా బ్రాహ్మణులు కూడా వేదం చదవకూడదు. క్రతువుల సమయంలో తప్ప.
नाभिव्याहारयेद् ब्रह्म स्वधानिनयनाद् ऋते ।
शूद्रेण हि समस्तावद् यावद् वेदे न जायते ॥ १७२ ॥
nābhivyāhārayed brahma svadhāninayanād ṛte |
śūdreṇa hi samastāvad yāvad vede na jāyate || 172 ||
అతను క్రతువులు సమయంలో తప్ప ఇతరత్రా వేద గ్రంథాలను ఉచ్చరించకూడదు; ఎందుకంటే అతను వేదంలో జన్మించనంత కాలం, అతను శూద్రుడితో సమానం.
విద్యాభాస్యం ఆవంత వరకు బ్రాహ్మణుల పిల్లలు కూడా శూద్రులతో సమానం అని ఇక్కడ చెప్పబడింది. అంటే విద్యాభ్యాసం వలన మాత్రమే ఉన్నత వర్ణం సిద్ధిస్తుంది అని అర్ధం.
అంబేద్కర్ గారి అభిప్రాయాలు:

కాబట్టి వర్ణం అంటే కూడా అర్ధం తెలియకుండా విషప్రచారం చేసే వారి మాయలో పడకండి.