ఆనాటి రక్త పిపాసే నేడు శాంతి కపోతం అయ్యింది!
ఒకప్పుడు మనుషులను కత్తి పట్టమని ప్రోత్సహించిన యుద్ధోన్మాదం, నేడు అహింసా గీతాలు పాడుతోంది.
ఒకప్పటి యేసు:
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక.
(యిర్మియా 48:10)
Cursed are those who refuse to do the LORD’s work, who hold back their swords from shedding blood!
(Jeremiah 48:10)
(యెహోవా చెప్పినట్టు యుద్ధం చేయాలి. మనుషులను చంపాలి. నిర్లక్ష్యం చేసినవాళ్లు, తమ కత్తికి నెత్తురు అంటకుండా యుద్ధం చేసేవాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. నాశనం అయిపోతారు అని యెహోవా గారు వార్నింగ్ ఇస్తున్నారు)
ఇప్పటి యేసు:
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. (మత్తయి 5:39)
But I tell you, Do not resist an evil person. If someone strikes you on the right cheek, turn to him the other also. (Matthew 5:39)
అదే యెహోవా నేడు యేసుగా పుట్టి చెడ్డవాళ్ళని ఎదురించకండి. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అంటున్నాడు.
ఎందుకు ఈ మార్పు? యెహోవా/యేసు మారిపోయాడా ?
“యేసు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు”
యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.(హెబ్రీయులకు 13:8)
Jesus Christ is the same yesterday and today and for ever. (Hebrews 13:8)
“యెహోవా ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు”
యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. (మలాకీ 3:6)
“I the LORD do not change. So you, O descendants of Jacob, are not destroyed. (Malachi 3:6)
ఓరి నాయనో ..!
ఒకప్పుడు నెత్తురు కత్తికి అంటకపోతే శాపం పెట్టిన నువ్వే నేను శాంతి వచనాలు పలుకుతున్నావు. నేను మారలేదు అంటున్నావు.
హత్యలు చేయించిన నువ్వే అహింసని బోధిస్తున్నావు.
నువ్వు మారకపోతే ఇప్పుడు మారింది ఎవరు?
బైబిల్ రచయితలా ? బైబిల్ చదివే పాఠకులా ?
మారను అని చెప్పి నువ్వు మారిపోతే, నిన్ను అందరూ అబద్ధాలకోరు అంటారు అని తప్పించుకు తిరిగుతున్నావా ప్రభూ ..!