దైవకుమారుడు అయిన యేసుకి తల్లిగా అందరికీ తెలిసిన పేరు మేరీ.
దేవుని అనుగ్రహంతో యేసుకి జన్మనిచ్చింది మేరీ. మగవాడి స్పర్శ లేకుండా మనిషి పుట్టడం బైబిల్ లో ఇది మూడో సారి.
ఆదాము, హవ్వ ఇద్దరూ sex లేకుండా పుట్టిన వాళ్లే. ఆ తర్వాత యేసు. ఇలాంటి ఘటనలు బైబిల్ లో అరుదు.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.(లూకా 1:28)
అయితే ఇలా sex జరగకుండా మగ బిడ్డ పుట్టడం పూర్తిగా unscientific అయినప్పటికీ క్రైస్తవులు పట్టించుకోరు. ఎందుకు అంటే వారికి దేవుడు ఏదైనా చెయ్యగలడు అనే గుడ్డి నమ్మకం. సారీ గట్టి నమ్మకం.
కొంతమంది క్రైస్తవులు మేరీ కన్యత్వానికి దైవత్వం ఆపాదించారు. ఆది కాలం నుండి దేవతగా స్త్రీ కన్యత్వాన్ని పూజించడం ఒక ఆచారంగా ఉంది. ఈ మధ్య కొందరు క్రైస్తవులు “Mary’s Vagina ” అనే ఆకృతి ని ఊరేగించి మేరీ విశిష్టత తెలియజేశారు.
పవిత్రమైన మాతృ స్థానాన్ని అవమానించే వెధవలు ఉన్న కాలం లో, మేరీ కీ ఇలాంటి గుర్తింపు రావడం మెచ్చుకోతగ్గదే.
మనదేశంలో మేరీ పూజ:
- ఆరోగ్యమాత
Our Lady of Good Health (Ārōkkiya annai) అని పిలుచుకునే మేరీ మాత ఆలయం తమిళనాడులో ఉంది. Vatican City అనుమతి తో నడుస్తున్న ఈ ఆలయంలో భక్తులు కొలిచేది Virgin Mary నే.
Full details :
https://en.m.wikipedia.org/wiki/Our_Lady_of_Good_Health
- విజయవాడ గుణదల మాత:
విజయవాడ లో Virgin Mary కి భారతీయ క్రైస్తవులు కొత్త పేరు పెట్టారు. గుణదల మాత.
ఈ ఆలయానికి కూడా Vatican City అనుమతి ఉంది.
మన దేశంలో అమ్మవారి భక్తులు ఉత్సవాలు కూడా చేస్తారు.
http://www.gunadalashrine.org/
Mary ని పూజించవచ్చా?
ఇలాంటి ప్రశ్నలు మన దేశంలో పుట్టవు. ఎందుకు అంటే ఇక్కడ స్త్రీ ఎప్పుడూ పూజనీయురాలే.
క్రైస్తవం ప్రకారం స్త్రీని పూజించకూడదు. ఎందుకు అంటే బైబిల్ ప్రకారం యెహోవా మాత్రమే దేవుడు.
ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు. (నిర్గమకాండము 34:14)
కాబట్టి మేరీ ని పూజించేవాళ్ళు అందరికీ నరకానికే పోతారు అని బైబిల్ చెప్తోంది.
అయినా సరే స్త్రీని పూజించడం తప్పు కాదు. తల్లి లేకపోతే సృష్టి లేదు. కాబట్టి మేరీ ని పూజించి నరకానికి పోవడంలో తప్పేమీ లేదు.
పైగా అది స్త్రీకి విలువ పెరుగుతుంది. అందరూ మేరీ ని ఆదర్శంగా తీసుకోవాలి. Vatican City నుండి పోపు గారి అనుమతి కూడా ఉంది. ఇక క్రైస్తవులు మీ ఇష్టం!
ఇప్పటికీ పోస్ట్ length పెరిగింది. మరో వ్యాసం లో కలుద్దాం!