విధవరాండ్లపై, అనాధలపై జాలి చూపని దేవుడు!
యెహోవా ఒక విధవరాలిని, అనాధని రక్షించాలంటే అతను ఖచ్చితంగా యెహోవాని పూజించే వాళ్లు అయ్యుండాలి. లేకపోతే యెహోవా వాళ్లపై జాలి చూపడు. పైగా వాళ్ళపై తన కోపాన్ని ప్రదర్శిస్తాడు.

విధవలు పెళ్లి చేసుకోకూడదు. కానీ కామం ఎక్కువ అయ్యి తట్టుకోలేక పోతే తప్పదు కాబట్టి అప్పుడు పెళ్లి చేసుకోవాలి.
నావలెనుండుట(పెళ్లి చేసుకోకుండా ఉండటం ) వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. (1 కోరింథీయులకు 7:8) అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.(1 కోరింథీయులకు 7:9) అంటే పెళ్లి అనేది sex కోసమే. లేదా కామ కోరికలు ఉన్న విధవలు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. Nuns వ్యవస్థ ఇక్కడ నుండే పుట్టింది.
మరి ఆ విధవరాలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి?
క్రైస్తవులని మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలి.!!!
భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. (1 కోరింథీయులకు 7:39)
యెహోవా గుళ్లో పూజారులు విధవలని పెళ్లాడొచ్చా?
విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను. (లేవీయకాండము 21:14)
యెహోవా గుళ్లో పూజరులు కన్నె పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. మిగతా వాళ్లు విధవలని పెళ్ళాడవచ్చు. ఏం చెప్తున్నాడో బైబిల్ రచయితకి అర్థం అయినా అర్థం అవుతోందా?
విధవలకి ప్రత్యేక వస్త్రాలు (తెల్ల చీర?)
అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన... (ఆదికాండము 38:14). యూదా కోడలు 2 భర్తలు చనిపోయిన తరువాత విధవ వస్త్రాలు ధరించి ఉండేది అని పై వాక్యం చెప్తోంది. అంటే తామారు తెల్ల చీర లాంటివి కట్టుకునేదా?
Summary:
యెహోవా/యేసు అనాధలని విధవలని రక్షించాలంటే వాళ్లు క్రైస్తవులు అయ్యి వుండాలి. విధవరాలు క్రైస్తవులనే పెళ్లాడాలి. మారు పెళ్లి అయ్యేంతవరకు విధవ వస్తాలు ధరించాలి. Sex కోరికలు ఎక్కువ అయితే అప్పుడు పెళ్లి చేసుకోవాలి. యెహోవా గుళ్లో పూజరులు మాత్రం కన్నె పిల్లలనే పెళ్లాడాలి. మిగతా వాళ్లు విధవలని పెళ్ళాడవచ్చు.