బైబిల్ దేవుడికి గుడి అవసరమా? ఏమో చాలా కన్ఫ్యూజన్ లో బైబిల్ రచయితలు. మొదటి వర్గం సమాధానం - అవసరం లేదు. మనిషి కట్టే గుళ్లో దేవుడు ఉండడు అంటుంది ఈ వర్గం.

బైబిల్ దేవుడికి గుడి అవసరమా?

ఏమో చాలా కన్ఫ్యూజన్ లో బైబిల్ రచయితలు.

మొదటి వర్గం సమాధానం – అవసరం లేదు. మనిషి కట్టే గుళ్లో దేవుడు ఉండడు అంటుంది ఈ వర్గం.

  1. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. (అపో. కార్యములు 17:24)
  2. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?(యెషయా 66:1)

పై రెండు వాక్యాలు చూపుంచి.. చూశారా దేవుడుకి గుడి అవసరం లేదు. కాబట్టి మీ గుళ్లో ఉన్న దేవుడు తప్పు. సర్వ సృష్టిని చేసిన దేవుడికి గుడి అవసరమా? అని చెప్పి మతం మార్చే వర్గం పాస్టర్లు ఉంటారు.

వాళ్లు బహుశా బైబిల్ పూర్తిగా చదవలేదు.

దేవునికి గుడి కట్టమని స్వయంగా బైబిల్ దేవుడే చెప్తున్న వచనాలు చూడండి.

  1. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. (నిర్గమకాండము 25:8).

గుడి ఎలా కట్టాలో కూడా యెహోవా చెప్పాడు.

నేను నీకు కను పరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. (నిర్గమకాండము 25:9)

ఇంకా ఏ ఏ వస్తువులు కావాలో.. ఆ తర్వాత వచనల్లో చెప్తాడు.

మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపునార, మేక వెండ్రుకలు, ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మ కఱ్ఱలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే…

కాబట్టి యెహోవా చెప్పినట్టు గుళ్లు కట్టారు. మోసే తర్వాత వచ్చిన, సొలొమోను రాజు జెరూసలేం దేవాలయం కట్టాడు అని బైబిల్ చెప్తుంది.

ఆ గుళ్లోని వస్తువుల్ని కూడా ఎవరూ తాకకూడదు. అదో పెద్ద అంటారు బైబిల్ రచయితలు.

  1. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. (దానియేలు 5:3)

“దేవుని నివాసమగు ఆలయములోనుండి.. “
అని ఉంది. ఇంగ్లీషులో House of the Lord ” ani వుంటుంది.

మనుషులు కట్టిన గుళ్లో దేవుడు ఉండటమా? ఛీ ఛీ
అన్నారు కదా.. ఇప్పుడు యెరూషలేము దేవాలయం దేవుని నివాస స్థలం ఎలా అయింది?

……

అయితే ఇప్పుడు బైబిల్ దేవుడు యెరూషలేము దేవాలయంలో ఉంటాడా?

ఉండటానికి ఇప్పుడు ఆ గుడి ఎక్కడ ఉంది? ముస్లింలు దాన్ని కూల్చేశారు కదా?

కూల్చేశారు కాబట్టే మా దేవుడుకి గుడి అవసరం లేదు. అని కొత్త పల్లవి అందుకున్నారు క్రైస్తవులు.

తమ దేవుడుకి గుడి అవసరం లేదు. దేవుడు ప్రజల హృదయాల్లో ఉంటాడు, మీ శరీరంలో ఉంటాడు అని రాసుకున్నారు.

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. (1 కోరింథీయులకు 6:1)

సర్లే గుడి కూలిపోయింది కాబట్టి మానవ శరీరమే యెహోవా / యేసుకి ఆలయం అని సరిపెట్టుకుందాం అనుకుంటే లేదు యేసు /+ యెహోవా పరలోకంలో ఉంటారు అని ఇంకో వర్గం క్రైస్తవులు చెప్పశాగారు.

  1. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు.తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. (కీర్తనల గ్రంథము 11:4)
  2. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.(ప్రకటన గ్రంథం 11:19)

ఇంతకీ యెహోవా ఎక్కడ ఉంటాడు. యెహోవాకి గుడి అవసరమా? అవసరం అయితే యెహోవా ఆజ్ఞతో గుడిని ముస్లింలు కులుస్తుంటే ఎందుకు ఆపలేదు / ఆపలేకపోయాడు? ఆ ఆలయంలో కూలిపోగానే పరలోకంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడా?

ఇవేమి అర్ధం కాని మా పాస్టర్ గారు.. మా ఊరిలో ఈ మాట చెప్పాడు. అందరూ చెప్తూ ఉంటారు.

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. (మత్తయి 6:9)

సర్లే క్రైస్తవులు అందరూ ఆమెన్ అనేసి బైబిల్ మూసేయండి.!

మీ బైబిల్ మీ ఇష్టం.

మేము share చేసుకుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *