
ఇలా సూటిగా, సుత్తి లేకుండా యెహోవాను ప్రశ్నించగలరా?
యెహోవా కొంతమంది మనుషులకే కాదు — ప్రతీ మనిషికి కొన్ని ఆహార నియమాలు పెట్టాడు. యెహోవాకు అమోదయయోగ్యమైన ఆహారాలను కోషెర్ ఆహారాలు అంటారు. విరుద్ధమైన వాటిని నాన్ కోషెర్ అంటారు. హలాల్ హరామ్ లాగా అన్నమాట.
�� యెహోవా చెప్పిన కొన్ని ఆహార నియమాలు:
మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు:
“అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.”
(ఆదికాండము 2:17)
హలాల్ చేయని మాంసం తినకూడదు (రక్తంతో కూడిన మాంసం):
“అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.”
(ఆదికాండము 9:4)
పస్కా మాంసాన్ని అన్యులు తినకూడదు:
“ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు.”
(నిర్గమకాండము 12:43)
“పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.”
(నిర్గమకాండము 12:45)
“పరదేశి యెహోవా పస్కాను ఆచరించగోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చు. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.” (నిర్గమకాండము 12:48)
రెండు డెక్కలులేని నెమరువేయు జంతువులు తినకూడదు:
“ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.”
(లేవీయకాండము 11:4)
పంది మాంసం తినకూడదు:
మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు. (ద్వితీయోపదేశకాండము 14:8)
కళేబరములను హేయముగా పరిగణించాలి, వాటి మాంసం తినకూడదు:
“అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.”(లేవీయకాండము 11:11)
ప్రాకే జీవరాశులన్నీ హేయములు — తినకూడదు:
“నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.”
(లేవీయకాండము 11:41)
యాజకుని కుమార్తె అన్యునితో పెళ్లి అయితే ఆమె ప్రతిష్ఠార్పణ ఆహారం తినకూడదు:
“యాజకుని కుమార్తె అన్యునికి ఇచ్చినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.” (లేవీయకాండము 22:12)
పొలుసులు లేనివి — అంటే పీతలు, రొయ్యలు — తినకూడదు:
“సముద్రములలోనేమి, నదులలోనేమి… సమస్త జలజంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు.” (లేవీయకాండము 11:10)
�� ఈ నియమాలన్ని యెహోవా చెప్పినవే. కానీ…
బైబిల్ చెప్పిన ఆహార నియమాలను పాటించకపోతే బైబిల్ ప్రకారం అది పాపం. దైవాజ్ఞను ముట్టడిస్తే నరకం తప్పదని వాక్యాలే అంటున్నాయి.
అయితే ఇప్పుడు చూడండి…
యెహోవా “పీతలు, రొయ్యలు తినకూడదు” అంటున్నాడు.
కానీ…
చాలామంది క్రైస్తవులు — “లొట్టలు వేసుకుంటూ తింటారు!”
అదే స్నేహితుడిని నేను అడిగాను:
“రొయ్యల కూర తింటావా?” సమాధానం? దాటవేశారు.
బీఫ్ బిర్యానీ, లివర్ ఫ్రై గురించి మాట్లాడుతూ మొండిగా వాదించే వాళ్లు… రొయ్యల విషయంలో మాత్రం నిశ్శబ్దం ఎందుకు?
⚠️ వాస్తవం ఏంటంటే…
బైబిల్ చెప్పిన అన్ని నియమాల్ని నిజంగా పాటించాలంటే, ఎడారిలో బ్రతకాల్సిందే.
ఇందుకు కారణం — మన రోజువారీ జీవితం లో బైబిల్ నిషేధించిన పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అయినా సరే, బైబిల్ పేరుతో ఇతరుల ఆచారాలను తప్పుబడటానికి ముందు, స్వీయ ఆచరణపై ప్రశ్నించుకోవడం అవసరం.
✅ ముగింపు పాయింట్:
బైబిల్ ను పూర్తి గౌరవిస్తే — బైబిల్ చెప్పిన ఆహార నియమాలను పాటించాలి.
పాటించలేకపోతే — మౌనంగా ఉండడం మంచిది.
కానీ పాటించకుండా — ఇతరుల ఆచారాలను తప్పు అనటం అనైతికం, తార్కికంగా చెల్లదు.