David and bathsheba

David and bathsheba

ఎన్ని ఘోరాలు జరిగినా - నో యెహోవా.. కానీ.. WHY JEHOVAH PUNISHED DAVID?

ఎన్ని ఘోరాలు జరిగినా – నో యెహోవా

కానీ దావీదు బత్సెబాని పెళ్ళాడటం (rape) మాత్రమే యెహోవాకి సమస్యగా మారింది. ఎందుకు?

పూర్తిగా చదవండి.

వావి వరసలు లేకుండా ప్రవర్తించిన దేవుని బిడ్డలు మనకు బైబిల్ నిండా కనిపిస్తారు. అయితే యే సందర్బంలోనూ యెహోవా వాళ్ళకి శిక్షలు వేయడు. కనీసం స్పందించడు.

  1. క్రైస్తవులకి మూల పురుషుడైన యూదా, తన ఇద్దరి కొడుకులకు భార్య అయిన తన సొంత కోడలు తామారుతో sex చేసి పిల్లల్ని కనినప్పుడు అది తప్పు అని యెహోవా ఎక్కడా చెప్పలేదు. సరికదా ఆ వంశంలోనే యేసు పుట్టాలి అని ఆశీర్వదించాడు. అలా పుట్టిన సంతానం 12 గోత్రాలకి మూల పురుషులు అయ్యారు.(ఆదికాండం 38:1-30)
  2. సొలొమోను అనే దేవుని ప్రవక్త, రాజు 1000 మంది స్త్రీలను పెళ్లాడినప్పుడు ( 700 భార్యలు +300 ఉంపుడుగత్తెలు ) కూడా యెహోవా కి ఎటువంటి సమస్యా లేదు. ఈ సొలొమోను ఆకు బాగుంది.. Smell బాగుంది అంటూ స్త్రీలపై బూతులు రాస్తూ పరమగీతం రాసినప్పుడు కూడా ఎలాంటి స్పందనా లేదు. (1 రాజులు 11:3)
  3. లోతు అనే ప్రవక్త, తన ఇద్దరు కూతుళ్ళతో శృంగారం చేసి పిల్లల్ని కనినప్పుడు కూడా యెహోవా స్పందించలేదు. పైగా లోతుని దేవుడు రక్షించాడు అంటోంది బైబిల్. అలాగే తండ్రి కూతుళ్ళ సంతానం ఎన్నో జాతులకి మూల పురుషులు అయ్యారు.(ఆదికాండం 19:36-38)
  4. దావీదు కొడుకు దావీదు కూతుర్ని రేప్ ( అన్నా చెల్లళ్ళ రేప్ ) చేసినప్పుడు కూడా యెహోవా స్పందించ లేదు. దావీదు కూడా స్పందించలేదు. తామారు అన్న రంగంలోకి చెల్లెని రేప్ చేసిన వాడిని చంపాడు.(2 సామోయేలు 13:14)
  5. ఇస్లాం మరియు క్రైస్తవులకు మూల పురుషుడు అబ్రాహాము తన సొంత చెల్లెలు (శారాను) పెళ్లాడినప్పుడు కూడా యెహోవా ఇది తప్పు అనలేదు. పైగా ఆమెను అబ్రాహాము దగ్గరకి పంపించి వారిని కలిపాడు.( ఆదికాండం 20:12)

ఇలా బైబిల్లో జరిగిన అనేక ఘోరాతి ఘోరమైన /వావి వరసలు లేని అక్రమ సంబంధాల విషయంలో సైలెంట్ గా ఉండిపోయాడు యెహోవా. వాళ్లని తప్పు అని చెప్పే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని చంపేసే యెహోవా ఇలాంటి ఘోరాలకి ఎందుకు స్పందించలేదు?

కానీ ఒక్క సంఘటనలో మాత్రం యెహోవా స్పందించాడు. అదే దావీదు అనే రాజు బత్సెబా అనే ఒక స్త్రీని పెళ్లాడినప్పుడు. యూరియా అనే వాడి భార్యని దావీదు రేప్ చేసినప్పుడు యెహోవాకి చాలా కోపం వచ్చింది. వావి వరసలు మరచినప్పుడు రాని కోపం యెహోవాకి ఇప్పుడు ఎందుకు వచ్చింది?

కారణం ఊరియా భార్య ఒక్క హిత్తీయురాలు.

నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? #హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? (2 సమూయేలు 12:9)

“నీవు నన్ను లక్ష్యము చేయక #హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.” (2 సమూయేలు 12:10)

“హిత్తీయుడు అయిన ఊరియా భార్య ” అనేది యెహోవా యొక్క ప్రాబ్లెమ్. అందుకే ఆ #హిత్తీయుడగు అనే పదాన్ని రెండు సార్లు నొక్కి వక్కాణించారు బైబిల్ రచయితలు.
ఎవరీ హిత్తీయులు?

హిత్తీయులు అన్య దేవతలను పూజించేవాళ్ళు. కాబట్టి వీళ్ళని చేసుకుంటే ఇజ్రాయెల్ యువకులు ఇతర దేవతల వైపు వెళ్ళిపోతారు అనేది యెహోవా యొక్క ప్రధానమైన సమస్య. అందుకే వారితో పెళ్లిళ్లు నిషేదించాడు.

ద్వితీయోపదేశకాండము 7:1-2

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత

ద్వితీయోపదేశకాండము 7:3

నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

ద్వితీయోపదేశకాండము 7:4

నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.

చూశారు కదా ద్వితీయోపదేశకాండము 7:1-4 లో హిత్తీయులతో సంబంధాలు పెట్టుకోవద్దని యెహోవా సెలవిచ్చాడు.

ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఎన్ని వావి వరసలు తప్పినా పర్వాలేదు. ఇతర దేవతలను పూజించే వాళ్ళతో పెళ్లి సంబంధాలు పెట్టుకో కూడదు అని.

ఇక క్రైస్తవులు అడగబోయే ప్రశ్న.. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే దావీదుకి వార్నింగ్ ఇచ్చాడు యెహోవా కదా అని.. కాదు ఎందుకు అంటే దావీదుకి అమ్మాయిల్ని supply చేసి చెడగొట్టిందే యెహోవా.

నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.(2 సమూయేలు 12:8)

కాబట్టి అక్రమ సంబంధాలతో యెహోవా కి ప్రాబ్లెమ్ లేదు. దావీదు 12 మంది స్త్రీలని పెళ్లాడటానికి, అంతకి మించిన ఉంపుడుగత్తెలతో పొండటానికి కారణం యెహోవా.

ఇప్పుడు చెప్పండి క్రైస్తవులారా! దావీదు వ్యభిచారం చేశాడు అనే యెహోవా శిక్షించాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *