విధవలపై వెధవ నియమాలు...! బైబిల్ విధవ వివాహం గురించి ఏం చెప్తుందో చూడండి

బైబిల్ ప్రకారం మొగుడు చచ్చిన స్త్రీకి రెండో వివాహం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి.సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను. (ద్వితీయోపదేశకాండము 25:5)

Deuteronomy 25:5

If brothers are living together and one of them dies without a son, his widow must not marry outside the family. Her husband-s brother shall take her and marry her and fulfil the duty of a brother-in-law to her.

duty of a brother-in-law to her

అంటే మరిది ధర్మం కానీ భర్త ధర్మము అని తెలుగులో తప్పుగా అనువాదం చేశారు )పాత నిబంధన కాలంలో మొగుడు చచ్చిన స్త్రీలు (విధవలు) అన్యులని పెళ్లాడకూడదు. భర్త యొక్క అన్న దమ్ముళ్ళని మాత్రమే పెళ్లాడాలి.

పెద్ద మరిదికి మొదటి ప్రిఫెరెన్సు. వాడు కూడా చనిపోతే రెండో మరిది. ఇక ఎవరూ లేకపోతే, కొంచెం చిన్న వయసు ఉన్న మరిది ఉంటే మామతో కూడా పిల్లలని కనవచ్చు. యూదా తామారు కథలో ఇదే జరిగింది.

ఒకవేళ మరిది ఆ విధవని పెళ్లాడటానికి ఒప్పుకోకపోతే ఊరందరి ముందు మరిది ముఖాన వదిన ఉమ్మివేసి, మరిది యొక్క చెప్పులు ఊడదీశి అవమానించాలి. ఇది యెహోవా పెట్టిన నియమం.ఈ నియమాన్ని పాటించిన విదవాలని ఉత్తమ స్త్రీలు అంటుంది బైబిల్. తామారు అనే స్త్రీ ఉత్తమురాలు అనిపించుకుంది బైబిల్ లో ఈ రూల్స్ పాటించి.

కొత్త నిబంధన కాలంలోని కొందరు స్త్రీలు 5,7 భర్త లని భర్త మరణానంతరం పెళ్లాడినట్టు బైబిల్ చెప్తుంది.యేసు వచ్చాక ఈ నియమాన్ని కొంచెం మార్పు చేశారు.

భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. (1 కోరింథీయులకు 7:39)

A woman is bound to her husband as long as he lives. But if her husband dies, she is free to marry anyone she wishes, but he must belong to the Lord. (1 Corinthians 7:39)

చూశారు కదా.. భర్త చనిపోతే క్రైస్తవ స్త్రీలు క్రైస్తవులనే పెళ్లాడాలి. (He must belong to the Lord.) అని ఉంది.ఏమిటో క్రైస్తవ స్త్రీలు.. యెహోవా కాలం లో ఇష్టం ఉన్నా లేకపోయినా మరుదులని పెళ్లాడేవాళ్ళు. యేసు కాలంలో కొంచెం మార్పు వచ్చిందిరా బాబు అనుకుంటే క్రైస్తవులని తప్ప వేరే వాళ్లని పెళ్లాడకూడదు అంటున్నాడు.

క్రైస్తవ స్త్రీలకి తమకి నచ్చిన వాడిని పెళ్లాడే హక్కు లేదా?మరో విషయం.. అసలు విధవలకి పెళ్లే అవసరం లేదు. Sex కోరికలు ఎక్కువైతే, ఇక తప్పదు అనుకుంటే అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అని మరో మాట కూడా ఉంది. అది కూడా చూడండి.

1 కోరింథీయులకు 7:9

అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.ఇవన్నీ వద్దు అనుకుంటే అన్నీ మూసుకుని పెళ్లి పెటాకులు లేకుండా ఉండటం ఉత్తమం. అది కూడా బైబిలే చెప్తోంది.

1 కోరింథీయులకు 7:40

అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.

1 Corinthians 7:40

In my judgment, she is happier if she stays as she is– and I think that I too have the Spirit of God.

క్రైస్తవ అమ్మాయిలు ఇక మీ ఇష్టం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *