
WOMEN IN BIBLE-3

Bible ప్రకారం ‘స్త్రీ’ ఒక తింగరి బుచ్చి.
దేవుడు పుట్టించిన మగాడు ఒంటరిగా ఉండటం చూసి, అతనికి ఒక హెల్పర్ అవసరం అని గ్రహించి, దేవుడు మగాడికి తోడుగా ఒక స్త్రీ ని పుట్టించాడు. అయితే మగాడికి హయాకురాలిగా పుట్టిన స్త్రీ వలన మగాడు మోసపోయి.. పాపి అయ్యాడు. అందువలన ఇలాంటి ఆడవాళ్ళ వలన మరోసారి మోసపోకుండా పాపంలో పడకుండా ఉండేందుకు బైబిల్ ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పింది. అది ఏమిటంటే…
స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
(1 తిమోతికి 2:11-12)
స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు. పురుషుడు మీద పెత్తనం చేయకూడదు. ఎందుకు అంటే
మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.
(1 తిమోతికి 2:13-15)
అన్నీ మూసుకుని కూర్చుంటే ఆడాళ్లు పైకి ఎలా వస్తారు? మగాళ్లపై అధికారం చేయకపోతే సమానత్వం ఎలా అవుతుంది? ఇంతకీ ఆడాళ్లు ఎలా అభివృద్ధి లోకి వస్తారు. వాళ్ళకి రక్షణ ఎలా లభిస్తుంది?
wait
But women will be preserved through childbirth—if they continue in faith, love, and sanctity, with moderation. 1 Timothy 2:15
అంటే స్త్రీలు పిల్లల్ని కనడం ద్వారా మాత్రమే రక్షింపబడతారా? మగవాడికి బోధన చెయ్యడానికి పనికి రారా ?
మగాడికి స్త్రీకి ఇంత స్పష్టమైన విభేదం సృష్టించవేమిటి సామీ. 🙏
ఇది వివక్ష కాదా ప్రభువా ?