యెహోవాని నమ్మకపోయినా నర మాంస భక్షణే, యేసుని నమ్మినా నర మాంస భక్షణే!
ఇదేమి మతంరా బాబు!!!
తనని నమ్మని వాళ్లందరినీ హింసించి దారిలోకి తెచ్చుకోవడం యెహోవా స్టైల్.
తన మాట వినకపోతే మీ పిల్లల మాంసం మీరే తినేలాగా నేనే చేస్తాను అంటాడు యెహోవా. అన్నట్టుగానే ఇద్దరు తల్లులు తమ పిల్లల మాంసం తిన్నారని బైబిల్ చెప్తోంది.
- వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. (యిర్మియా 19:9)
అలాగే అందరూ చెలికాని మాంసం ( తోటి వారి మాంసం ) తినేలా చేస్తాను అంటున్నాడు యెహోవా.
I will make them eat the flesh of their sons and daughters, and they will eat one another-s flesh during the stress of the siege imposed on them by the enemies who seek their lives.(Jeremiah 19:9)
మరికొన్ని వచనాలు చూడండి.
- కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును. (యెహెఙ్కేలు 5:10)
- యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.(యెషయా 49:26)
I will make your oppressors eat their own flesh; they will be drunk on their own blood, as with wine. Then all mankind will know that I, the LORD, am your Saviour, your Redeemer, the Mighty One of Jacob.” (Isaiah 49:26)
ఇలా మనకు ఎన్నో వచనాలు నరమాంస భక్షణ చేసేలా చేస్తాను అని యెహోవా చెప్పిన వచనాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అయితే యెహోవా ఎంత మంది చేత నర మాంస భక్షణ చేయించాడో క్లియర్ గా రాయబడలేదు. కానీ ఒక ఉదాహరణ మాత్రం మిగిలింది.
Evidence for Cannibalism :
మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. (2 రాజులు 6:29)
ఇది ఇక్కడ నెరవేరింది.
ఈ సంఘటన యెహోవా వలనే జరిగింది అని prove చేసిన నా post ఇక్కడ link లో చూడండి.
అలా తన మాట వినని వాళ్లని నానా హింసలకి గురి చేసి, ఆకలితో మాడ్చి వాళ్లు నర మాంస భక్షణ చేసేలా చేస్తాడు యెహోవా.
……..
ఇక యేసు సంగతి చూద్దాం.
యేసుని దేవుడుగా అంగీకరిస్తే, తాను ప్రజల పాపల కోసం చనిపోయిన గొర్రె పిల్ల అని నమ్మాలి. పరలోకం నుండి వచ్చిన ఆహారం యేసు శరీరం అని నమ్మాలి. తర్వాత ఏం చేయాలో కింద వచనం లో చూడండి.
పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.(యోహాను 6:51)
ఏమిటో యెహోవా/ యేసు… దేవుళ్లు మారినా నర మాంసం తినడం అనే కాన్సెప్ట్ మాత్రం మారలేదు.
ఒక్కప్పుడు జంతువుల మాంసం తినమని చెప్పేవాడు యెహోవా.
సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. (యిర్మియా 7:21)
కాలక్రమేణా జంతు మాంసం నుండి నర మాంసం వైపు బైబిల్ రచయితలు, దేవుళ్లు update అయినట్టు ఉన్నారు.
అయినా ఇలా నర మాంసం తినే వాళ్లని జంతువుల కింద, రాక్షసుల కింద జామకాట్టాల్సి ఉంటుంది.
అయినా ఇలాంటి వచనాలను రాసేటప్పుడైనా Cannibalism ప్రోత్సహించినట్టు అవుతుంది అని సగటు బైబిల్ రచయితలు ఆలోచించక పోవడం విచారకరం!!!
