పాపము మరియు మరణము
పాపము మరియు మరణము స్త్రీ వల్లనే వచ్చాయి. కాబట్టి స్త్రీని అదుపులో ఉంచాలి అని బైబిల్ చెబుతోంది.
- సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 25:24: “పాపము ఒక స్త్రీ మూలముననే ప్రారంభమాయెను; ఆమె వలనే మనమందరము మరణించుచున్నాము.”
- 1 తిమోతికి 2:13-14: “మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.”
- 2 కొరింథీయులకు 11:3: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరిచినట్లు, మీ మనస్సులును చెరుపబడి క్రీస్తునందలి నిర్మలత్వమునుండియు పవిత్రతనుండియు ఏమైనను తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాము.”
ప్రవర్తన మరియు హెచ్చరికలు
- సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 25:25-26: “చేదురు బావి నుండి నీరు లీక్ అవ్వకుండా ఎట్లు అడ్డుకొందువో, అట్లే దుష్ట భార్యకు స్వేచ్ఛను ఇవ్వకుము. ఆమె నీ మాట వినకుండిన యెడల, ఆమెను నీ నుండి వేరుచేసి పంపివేయుము.”
- ప్రసంగి 7:26: “మరణముకంటెను ఎక్కువ చేదైనది ఒకటున్నదని నేను కనుగొంటిని; అది ఎవతైతే వేటగాని ఉరివంటి మనస్సును, వలలవంటి చేతులను కలిగియున్నదో అట్టి స్త్రీయే; దేవుని దృష్టికి అనుకూలుడైనవాడు ఆమెను తప్పించుకొనును గాని పాపాత్ముడు ఆమెకు చిక్కును.”
- సామెతలు 2:16-18: “జ్ఞానము వ్యభిచారిణినుండియు, ఇచ్చకములాడు పరస్త్రీనుండియు నిన్ను విడిపించును… ఆమె యిల్లు మరణమునకు దారితీయును.”
సంఘంలో మౌనము మరియు విధేయత
- 1 తిమోతికి 2:11-12: “స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.”
- 1 కొరింథీయులకు 14:34-35: “స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలెనని ధర్మశాస్త్రము చెప్పుచున్న ప్రకారము వారు మాటలాడుటకు వారికి సెలవులేదు. వారు ఏమైనను నేర్చుకొన గోరినయెడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.”
స్త్రీకి రక్షణ మార్గము: పిల్లలు కనడం పెంచడం మాత్రమే!
- 1 తిమోతికి 2:15: “అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును.”
రచయిత నోట్: స్త్రీని పూజిస్తున్నట్టు నటించే కేథలిక్ క్రైస్తవుల బైబిల్లోను స్త్రీ గురించి నీచంగానే ఉండటం నన్ను ఒకింత ఆచార్యనికి గురిచేసింది!