యేసుని చంపింది ఎవరు?

ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మరి కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం తెలియాలి.

అసలు యేసుని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? యేసుని చంపేలా ప్రేరేపించిన శక్తులేమిటి? యేసుని చంపితే వచ్చే లాభమేమిటి?

యేసు ఏ సిద్ధాంతానికో, ఏ సమూహానికో ఎదురు వెళ్లి ఉంటాడు. లేడా చెయ్యకూడని తప్పులు ఏవో చేసి ఉంటాడు. ఇంతకీ ఏమిటవి? ఎవరికి ఎదురెల్లాడు?

  1. పరుశుద్ధ దినాన్ని దిక్కరించడం.
  2. పస్కా పండుగని అవమానించడం.
  3. యెహోవా దేవాలయాన్ని కూలుస్తా అనడం.
    4.Kosher ఆహార నియమాలని అవమానించడం.
    5.False messiah.
  4. తాగుడు అలవాటు
  5. పండ్ల చెట్టుని చంపడం

ఈ కారణాలతో యేసుని చంపేశారు యూదులు. ఎందుకంటే అలా చేస్తే చంపమని చెప్పింది యెహోవానే..!

Detailed గా చదవండి.

  1. “Sabbath Day”

యోహాను 5:10 నుండి 5-16 వచనాలు చూడండి.

ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.

అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.

వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.

వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.
ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.

ఇంకో సందర్బంలో కూడా యూదులు యేసుపై మండిపడతారు.

మత్తయి 12:10 నుండి 12-14

వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.

అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?

గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి
ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.

అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

యేసుని చంపాలని యూదులు భావించారు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం.

ఇక్కడ వాళ్ళు యేసుని చంపాలని ఎందుకు అనుకున్నారు? Sabbath Day అదే పరిశుద్ధ దినాన్ని యేసు పాటించనుందుకే. మరి అలా పాటించని వాళ్లని చంపేయమని యూదులని ప్రేరేపించింది ఎవరు?

సంఖ్యాకాండం 15:32

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా “ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.” సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.

Sabbath Day పాటించకపోతే చంపేయమని యూదులకి చెప్పింది, ఆ నియమాన్ని జీర్ణించుకునేలా చేసింది యేసు తన తండ్రి అని చెప్పుకున్న యెహోవానే కదా! మరి యేసుని చంపిన అపవాదు యూదులకి వేయడం న్యాయమా?

  1. పస్కా పండుగని అవమానించడం.

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.(john 2:13)

  1. Insulting Yehova Temple:

యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి. (యోహాను 2:19-20)

దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. (మత్తయి 27:40)

పైన పేర్కొన్న వాటిలో పస్కా బలికోసం జంతువులు గుళ్లో ఉండటం, పావురాల్లు అక్కడ ఉండటం యేసుకి నచ్చలేదు. అయితే పస్కా బలిలో జంతువుల్ని బలి ఇమ్మని, ఇవ్వకపోతే చంపుతా అన్నది యెహోవానే కదా!
ఆలయం జోలికి వస్తే యెహోవా సహిస్తాడా? యూదులు సహిస్తారా?

మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.(నిర్గమ కాండం 12:13-14).

దానియేలు అనే సువార్తలో జెరూసలేం దేవాలయం దేవుని నివాస స్థలం అని చెప్పబడింది కదా!

అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా… (దానియేలు 5:3)

ఆలయం దేవుని నివాస స్థలం కదా మరి దాన్ని కూల్చండి అన్నందుకు యెహోవా అనుచరులు hurt అవడంలో తప్పు ఏముంది? పస్కా బలి నిత్య కట్టడి అనే యెహోవా చెప్పాడు. మరి దానికోసం ఉంచిన పశువులను యేసు చెదారగొట్టడం యోధుల దృష్టిలో తప్పే కదా! ఆ కట్టడి వెనకున్న యెహోవా నే కదా వారి కోపానికి కారణం!!!

  1. Kosher ఆహార నియమాలని అవమానించడం

Insulting Yehova’s Kosher Food Rules & Cleaning rituals.

యెహోవా యూదులకు kosher ఆహారం ( పరిశుద్ధ ఆహారం) తినమని, అపవిత్ర ఆహారం తినొద్దని చెప్పాడు.
అపవిత్ర ఆహారం తినడం హేయం అని కూడా చెప్పాడు.

నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.(పీతలు తినకూడదు).(.లెవీయ కాండం 11:12)

పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ..(లేవీయకాండం 11:13)

పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.(లేవీయకాండం 11:7)

ఈ ఆహారపు అలవాట్లను యూదులు ఇప్పటికీ పాటిస్తున్నారు. అంతెందుకు యేసుకి బాప్టిజం ఇచ్చిన జోహాను మిడతలను(locusts insects ) తేనెతో కలిపి తినేవాడు. అది యెహోవా చెప్పిన ఆహార నియమమే కదా!

మరి యేసు దీనిని కూడా దిక్కరించాడు.

ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.
పరి సయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. (మార్కు 7:2-3)

వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని లోపలి నుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.(మార్కు 7:15-16)

అంటే నోటికి పాపానికి లింక్ లేదు.కేవలం మనసుకే లింక్ ఉంది అంటున్నాడు. తినే ఆహరం, అలవాట్లకి పాపం తో పనిలేదుంటున్నాడు.

పైన పేర్కొన్న ఆచారాలు అన్నీ యెహోవా పెట్టినవే. అవి మనుషులు పెట్టినవి అనడం యెహోవాని వ్యతిరేకించడమే. శుభ్రత పాటించని వాడిని, యెహోవా నియమాలని వ్యతిరేకించేవాడిని యూదులు తమ రాజుగా అంగీకారిస్తారా? అందులో వాళ్ళ తప్పేమి ఉంది?

  1. False Messiah( అబద్ధ ప్రవక్త )

యూదులకి ఒక్కడే దేవుడు. యెహోవాని తప్ప ఇంకో దేవున్ని అంగీకరించరు. యేసుకి messiah ( ఇజ్రాయెల్ని రక్షించే ప్రవక్త ) స్థానము ఇవ్వాలంటే యేసు కొన్ని పనులు చేయాలి. వాటిని నెరవేర్చలేకపోయాడు యేసు.
Messiah దావీదు వంశంలో పుట్టాలి, యూదుల రాజ్యం తిరిగి ఇప్పించాలి, వారిని గొప్పగా పాలించాలి, జెరూసలేం దేవాలయాన్ని నిర్మించాలి.. ఇలాంటివి యేసు చెయ్యకపోగా.. యెహోవా చెప్పిన వాటికి వ్యతిరేక అర్ధాలు చెప్పాడు.

ఒక వ్యక్తి అయితే యూదుడు అవుతాడు లేడా క్రైస్తవుడు అవుతాడు. రెండు కాలేడు అంటారు యూదులు. ఇక నేను, నా తండ్రి ఒక్కటే..అని చెప్పడం అంటే ఏక దేవతారాధకులైన యూదులకు కోపం రాదా? నేను తప్ప మరో దేవుడు లేడు అన్న యెహోవా అనుచరులు యేసు చంపేయాలి అనుకోవడం వెనుక నేను తప్ప వేరే దేవుడు లేడు. ఇతర దేవతల గుళ్లను కూల్చండి, వాళ్లని హతమార్చండి అంటూ యెహోవా అంతకు ముందు చెప్పిన ఆజ్ఞలే కారణం.

  1. తాగుడు అలవాటు

ఎవరి కొడుకైన తాగుబోతు అయ్యి తల్లి తండ్రుల మాట వినకపోయి ఉంటే గనుక వాడిని చంపెయ్యాలి అన్నది కూడా యెహోవా పెట్టిన నియమమే.

ద్వితీయోపదేశకాండము 21:20

మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగ బడి యున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్ప వలెను. అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

యేసు గురుంచి బైబిల్ లో ఇలా ఉంది.

మత్తయి 11:19

మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

  1. పండ్ల చెట్టుని చంపడం

ద్వితీయోపదేశకాండము 20:19

నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయు నప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.

కాబట్టి ఎంత కోపం వచ్చినా సరే పండ్ల చెట్టుని చంపడం యెహోవా ఒప్పుకోడు.

కానీ యేసు ఏం చేశాడో చూడండి.

ఆకలి తీర్చలేదని పండ్ల చెట్టుని చంపిన యేసు

మార్కు 11:13

ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.

యేసుకి బాగా ఆకలి వేసింది :

ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.(మత్తయి 21:18)

అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. (మత్తయి 21:19)

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు.. వేశ్యని వెనకేసుకు రావడం, యెహోవా తో పాటు నేను కూడా దేవున్ని అనడం, యెహోవా ని హింస చేసేవాడుగా చిత్రీకరించి తాను ఒక శాంతి ప్రియుడ్ని అనేలాగా ప్రవర్తించడం… ఇలాంటి ఎన్నో తప్పులు. యేసు యెహోవా వ్యతిరేకి కాబట్టే యెహోవా అనుచరులైన యూదులు అతన్ని చంపితే ఆదేదో ఘోరం జరిగినట్టు భావించడం అవివేకం.

Jews deicide అంటే యేసు చావకు యూదులే కారణం అని చెప్పడం. హిట్లర్ లాంటివాళ్లు యోధులందరినీ చంపేయాలనుకొని, వాళ్లపై దాడులు చేయడం కూడా దీనివల్లనే.

యేసుని చంపింది యూదులు మెదళ్ళలో యెహోవా నాటిన విషభీజాలు. యూదులు కేవలం యెహోవా అనుచరులు మాత్రమే. ఇప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు యేసుని నమ్మరు. అక్కడ క్రైస్తవుల జనాభా 2% మాత్రమే ఉండటం గమనార్హం.

యేసు తాను చేసిన పాపాలకే చనిపోయాడు. యెహోవా అనుచరులకి మాయమాటలు చెప్పి మోసగించబోయి, వాళ్ళ ఆచారాలని అవమానించబోయి.. వాళ్ళ చేతిలో.. తద్వారా రోమన్ రాజు చేతుల్లో.. ఇందులో మన కోసం చనిపోయాడు అనేది ఒక కట్టు కథ మాత్రమే!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *