Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ చదివి మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదేనా?


బైబిల్ లో ఉన్న బూతులు మనం బయట పెట్టినప్పుడు క్రైస్తవులు చెప్పే మాట ఏమిటంటే…
అవన్నీ దేవుడు ఎందుకు రాయించడంటే అలా మనం ప్రవర్తించకూడదు అని.
సహజంగా ఇదే సమాధానం అన్ని బూతు సంఘటనకు వాడతారు. ఐతే ఆయా సంఘటనల్లో ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్లని యెహోవా శిక్షించినట్టు రాయబడలేదు.

పైగా తప్పు చేసిన వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపిస్తుంది. అదే విచిత్రం.
ఉదాహరణకు : యూదా కుటుంబంలో జరిగిన బూతు పనుల విషయానికి వస్తే…
యెహోవా చేతిలో తన మొదటి భర్త చనిపోగా, తన మరిదిని పెళ్లాడిన తామారు, మరిదిని (రెండో భర్తని) కూడా యెహోవా చంపేయగా, చివరికి తన మామ అయిన యూదాతో sex చేసి పిల్లలని కంటుంది.

అయితే అలా పుట్టిన పిల్లల్ని ఆదర్శంగా చూపిస్తూ అలాంటి పిల్లలు మీకు కూడా పుట్టాలి అని అజర్వదించడం ఎంత వరకూ సబబు?
ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి. (రూతు 4:12)
అంటే ఇప్పుడు యెహోవా అనుగ్రహం వలన మన ఇంట్లో మామ కోడళ్లకి పిల్లలు పుట్టాలని బైబిల్ బోధిస్తోందా?
కొంచెం అయినా సిగ్గుండాలి కదా! ఇలాంటి వాక్యాలు రాయడానికి.
ఇలాంటి కథలు చదివిన మామ కోడళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తలచుకుంటేనే భయంగా ఉంది.
యూదా తామారు కథ పూర్తిగా తెలియాలంటే ఈ లింక్ చూడండి.

https://www.facebook.com/106914574790243/posts/148944460587254/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *