Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పొలాల్లో పెంట లాగా మనుషుల సవాలు పడతాయి!

Dead Bodies in the Open Field

యెహోవా ఒక శాడిస్ట్ గాడు (God) అని ఇది వరకే మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ ప్రజలని హింసించి, వేధించి, చంపి తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు యెహోవా. ఆ కార్యక్రమంలో భాగంగా ఇలా వార్నింగ్ ఇచ్చాడు.

యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక  పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.(యిర్మీయా 9:22)

Dead bodies will lie like dung on the open field,like cut grain behind the reaper, with no one to gather them.

Jeremiah 9:22

అంటే ఇప్పుడు యెహోవా చెప్పేది ఏమిటంటే తన మాట వినని వాళ్లని యెహోవా చంపుతాడు. వాళ్ళ సవాలు ఖాళీగా ఉన్న పొలాల్లో పెంట ( పేడ ) పడినట్టు, పంటకోసేటప్పుడు గింజలు ( పనలు) పడినట్టుగా సవాలు పడతాయి. ఆ శవాలని పోగు చేయడానికి కూడా ఎవరూ ఉండరు. అంటే అనాధ సవాళ్ళ లాగా పడి నాశనము అవుతారు అంటున్నాడు యెహోవా.

ఇలాంటివే మరికొన్ని వాక్యాలు.
వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”(యిర్మీయా 16:4)

ఆ రోజు యెహోవా చేత హతం అయిన వాళ్ళు భూమి ఒక అంచు నుంచి మరొక అంచు వరకూ ఉంటారు. వాళ్ళ కోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగుచేయరు. పాతిపెట్టరు. పెంటలాగా వారి శవాలు నేల మీద పడి ఉంటాయి.(యిర్మీయా 25:33)

ఇవి ఎక్కడ నెరవేరాయో చూద్దాం.

1. ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది’ ఆ మాట ప్రకారం ఇది జరిగింది” అన్నాడు. (2 రాజులు 9:37)

2. వాళ్ళు ఎన్ దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు. (కీర్తనలు 83:10)
3. దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది. (యెషయా 5:25)
అసలు ఇంత ఘోరంగా యెహోవా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?
ఇతర దేవతలను పూజించడం వల్లనే:
వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.(యిర్మీయా 8:2 )
యెహోవాని కాకుండా ఇతర దేవతలను పూజించే వాళ్ళ శవాలని ఖాళీగా ఉన్న పంటపొలంలో పెంట లాగా, రైతు కోస్తూ ఉంటే పడిన గింజల లాగా అనాధ సవాళ్ళ లాగా వదిలేసేలా యెహోవానే చేస్తాడు అని యెహోవా నే చెప్తున్నాడు.

MORE CROSS REFERENCES:


జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును. (జెఫన్యా 1:17)

అర్థం అయింది కదా..!

మనుషుల్ని భయపెట్టి, హింసించి, చంపి దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం మనం హంతకుల్లో, శాడిస్ట్ లలోనే చూస్తాము. అయిన ఇతర దేవతలను పూజించే వాళ్లని, ఇతర మతస్థులని చంపే వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి వాటిని ప్రోత్సహించిన బైబిల్ మన దేశంలో ఎలా చలామణి అవుతోంది?
ఇలాంటి ఘోరాలో ఎన్నో చేసిన యెహోవాని దేవుడు అని చెప్పిన యేసు ఎంతటి దుర్మార్గుడో అర్థం చేసుకోండి.
దాదాపు 28,00,000 మందిని చంపినట్టు ఆధారాలు ఉన్నాయి బైబిల్. ఇలా అనాధ సవాలుగా చనిపోయిన వారి లెక్క ఎవరు చెప్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *