Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యేసు మన కోసం చనిపోయిన రోజు అని క్రైస్తవులు ప్రచారం చేస్తారు. కాని నిజానికి ఈరోజు బైబిల్ లో యెహోవా యేసుని చంపిన రోజు అని ఉంటుంది.

బలి లేకపోతే పాపం పోదు అని నమ్మిన యెహోవా చివరికి తన కొడుకు అని చెప్పుకున్న యేసుని కూడా బలి తీసుకోవడమే గుడ్ ఫ్రైడే అంటుంది బైబిల్.

ఈ రిఫరెన్స్ లు చూడండి. మీకే అర్థం అవుతుంది.

  1. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రతనుండి రక్షింప బడుదుము.(రోమీయులకు 5:9)

Since we have now been justified by his blood, how much more shall we be saved from God-s wrath through him! (Romans 5:9).

“యెహోవా గారి కోపం నుండి జనం తప్పించుకోవాలి” అనే కారణం చేత యేసు చనిపోవాల్సి వచ్చింది. అని అర్థం

  1. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.( రోమీయులకి 3:25).

God presented him as a sacrifice of atonement, through faith in his blood. He did this to demonstrate his justice, because in his forbearance he had left the sins committed beforehand unpunished–(Romans 3:25).

అంటే పాపాలను తొలగించే బలి పశువు ( గొర్రె ) గా యేసుని చంపి అందరి పాపాలను యెహోవా తొలగుంచాడు.

  1. తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? (రోమీయులకు 8:32)

He who did not spare his own Son, but gave him up for us all–how will he not also, along with him, graciously give us all things? (Romans 8:32)

అంటే తన సొంత కొడుకునే చంపడానికి కూడా వెనకాడని యెహోవా మన కోసం ఏమైనా చేస్తాడు అని అర్థం.

కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఒక తండ్రి తన కొడుకుని బలి ఇచ్చిన రోజే తప్ప ఇందులో గొప్ప విషయం కాని, శుభకరమైన విషయం కాని లేదు.

తాను సృష్టించిన మనుషుల యొక్క పాపాలను తొలగించడానికి ఒక మనిషిని అది కూడా తన కొడుకు అని చెప్పుకుంటున్న వాడిని హింసలకు గురి చేసి చంపడడం అంత తెలివైన పని అనిపించుకోదు.

పైనా సర్వ శక్తి మంతుడైన నరబలి కోరడం అమానుషం కూడా!!

మీ రమణ నేషనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *