Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.( కీర్తనల గ్రంథము 127:2)

ఉదయాన్నే లేచి, రోజంతా కష్ట పడి, ఇంటికి తెచ్చుకునే ధనం వ్యర్థం అని యెహోవా చెప్తున్నాడు. తన భక్తులు పడుకుని ఉన్న సమయంలో అంటే పని చేయకుండా ఉన్న సమయంలో కూడా యెహోవా వారికి ధనం ఇస్తాడు అంట!

ఈ బైబిల్ వాక్యం చూడండి.

మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.( కీర్తనల గ్రంథము 127:2)

It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows; for so He giveth His beloved sleep. (Psalms 127:2)

ఇలాంటి ఆఫర్ విన్న తర్వాత ఏ మనిషి అయినా ఏమనుకుంటాడు.

కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏమిటి? దేవుడే ఇస్తున్నాడు కష్టపడకుండా!

అనుకోడు..?

అలాగే మరో వాక్యం చూడండి.

మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు. (యెషయా 61:6)

And you will be called priests of the LORD, you will be named ministers of our God. You will feed on the wealth of nations, and in their riches you will boast.(Isaiah 61:6)

ఇలా ఒకప్పుడు తన యాజకులని డబ్బున్న వాళ్ళుగా చేస్తాను అని యెహోవా మాట ఇచ్చాడు.

మాట ఇచ్చాడు సరే, వీళ్ళని కూడా ఎలా డబ్బున్న వాళ్ళని చేస్తాడు ?

ఎలా అంటారా ? దశమ భాగాల ద్వారా…!

భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. (లేవీయకాండము 27:30)

దశమ భాగం అనే స్కీమ్ పెట్టి, ప్రజల సొమ్ముని దోచుకోవడం యెహోవానే నేర్పాడు.
పనిపాట లేని సోమరిపోతులాగా పాస్టర్లని తయారు చేసాడు.ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ములో, పండించిన పంటలో 10% దేవునికి ( పాస్టర్ కి ) సమర్పించుకోవాలి.

మీరు బైబిల్ దేవున్ని నమ్ముకుంటే మీరు నిద్రపోయినా యెహోవా మీకు ధన సహాయం చేస్తాడు. ఇలా గొడ్డు లా కష్టపడటం వృథా!.
ఈ వాక్యం చదివిన మనిషి అయితే సోమరిపోతు అవుతాడు లేదా పాస్టర్ అవుతాడు. ఎందుకు అంటే యెహోవా దయతో పనిచేయకుండా డబ్బులు వచ్చే మార్గం అదొక్కటే.

మనకైతే కష్ట పడకుండా ధనం దొరకదు. కష్ట పడకుండా రైతు వేసిన పంట చేతికి రాదు. కాని పాస్టర్ లకి ఫ్రీ గా 10% రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోనే ఎందరో పాస్టర్లు కుబేరులు అయ్యారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సొంత ఫ్లైట్స్, హెలికాప్టర్, సొంత island, ఇలా ఎన్నో కొనుక్కుని రాజ భోగాలు అనుభవిస్తున్నారు పాస్టర్లు.

ఈ క్రింది లిస్ట్ లో బాగా డబ్బున్న పాస్టర్లను చూడండి.

  1. ప్రపంచ Top -20 పాస్టర్లు
    https://austinemedia.com/top-20-most-richest-pastors-in…/
  2. Kerala richest pastor
    https://www.ucanews.com/…/indian-officials-search…/90195
  3. Paul Dinakaran
    https://youtu.be/jwP5PrQYeO8
  4. Top -10 pastors
    https://www.cheatsheet.com/…/net-worth-richest-pastors…/
  5. KA Paul
    https://www.ap7am.com/lv-331745/

ఇలాంటి ఎందరో పాస్టర్స్ పేద దేశం ధనిక దేశం అని సంబంధం లేకుండా డబ్బున్న పాస్టర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇలాంటి పాస్టర్లు మన దేశంలో ప్రతి గల్లీలోనూ ఉంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటారు. అంటే ఇలా ఎంత మంది పాస్టర్స్ కి కష్టపడకుండా సొమ్ము అప్పజెప్పుతున్నాడో ఆలోచించండి.

డబ్బు ఊరకనే రాదు. జాగ్రత్త వహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *