
కొంచెం బూతు పదాలు వాడాల్సిన అవసరం ఏర్పడింది. పోస్ట్ అలాంటిది మరి. అర్థం చేసుకోగలరు.
బైబిలులోని కొన్ని కథలు చాలా తమాషాగా ఉంటాయి. మరికొన్ని పరమ దరిద్రంగా ఉంటాయి.
అలాంటి పరమ చెత్త కథల్లో ఒకటి యెరుసలేమ్ తో యెహోవా ప్రేమ కథ
నిజానికి ఈ కథతో ఒక సినిమా కూడా వచ్చింది.
సినిమా పేరు బావ బావ పన్నీరు. జంథ్యాల డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది.
అందులో కథాంశం ఏమిటంటే…
ఒక వయసు మళ్ళిన పెద్దాయన ఒక చిన్న పాపని చేరదీసి, ఆమెకి ఒక తండ్రి స్థానంలో ఉండి అన్ని విధాలా కాపాడి, ఆమె వయస్సులోకి రాగానే ఆమెను పెళ్లాడాలని చూస్తాడు. తాను పెంచుకున్న ఆడ కూతురుని తానే పెళ్లాడాలని చూసిన విలన్ గా, అందరి చేత ఛీ కొట్టించుకునే ఆ డకోటా పాత్రని కోట శ్రీనివాస్ రావు గారు చాలా బాగా నటించి అందరినీ మెప్పించారు.
అయితే అలాంటి పాత్రలు కేవలం సినిమాల్లోనే ఉంటాయి. బయట ఉండవు అని అందరిలాగే మీరు కూడా అనుకుంటే పొరపాటే.
బైబిల్లో అలాంటి కథ ఒకటి ఉంది.
ఈ కథలో యెహోవా ఒక ఆడదాన్ని పెంచుకుంటాడు. అనాధగా దొరికిన ఆమెను తానే దగ్గర ఉండి పెద్ద చేస్తాడు. యెహువా చేతిలో పెరిగిన ఆ పిల్ల కొంత కాలానికి వయసుకి వస్తుంది. పరువం వచ్చిన ఆమెకు అన్ని అవయవాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆమెను చేరదీసిన యెహోవాయే ఆమెను అవమానించడం ఇష్టం లేక (బహుశా రేప్ చేయడం అయ్యుండొచ్చు) ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఎన్నో నగలు, బట్టలు కొంటాడు. కానీ ఆమె వేరే వాడితో లేచిపోతుంది. ఇది క్లుప్తంగా బైబిల్ లోని కథ !
ఇప్పుడు చెప్పండి ఈ బైబిలులోని పెద్దాయన పాత్ర/ యెహోవా పాత్ర ఉత్తమైన పాత్రేనా?
అందరూ ఆమోదించదగిన పాత్రేనా ?
… …. … …
ఇక్కడ స్త్రీ పాత్రగా నేను చెప్పింది యెరుసలేమ్ నగరం గురుంచి. ఒక నగరాన్ని స్త్రీగా వర్ణిస్తూ యెహోవా ఎలా మాట్లాడుతున్నాడో ఇక్కడ రెఫరెన్సెస్ లో చూడండి. నగరానికి వక్షోజాలు ఎందుకు ఉంటాయి? వాటిని చూసి యెహోవా ఎందుకు టెంప్ట్ అవుతాడు? ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో మా క్రైస్తవులు చెప్తారు.
యెహెఙ్కేలు 16:3-7
ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను.
యెహెఙ్కేలు 16:8
మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఆ తర్వాత కథంతా ఆమె (యెరుసలేమ్ ) ఎలా చెడిపోయింది. ఆమె ఎలా వ్యభిచారం చేసింది ఇవన్నీ ఉంటాయి.
నోట్: పెంచుకున్న కూతురుని యెహోవా రేప్ చేయాలనుకున్నాడు. కానీ బాగుండదు అని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఇలాంటి వర్ణనలో దేవుడిని ఇరికించిన బైబిల్ రచయిత పైనే నా కోపం అంతా !
The next time I read a blog, Hopefully it doesnt fail me just as much as this one. I mean, Yes, it was my choice to read through, but I actually thought you would have something useful to say. All I hear is a bunch of moaning about something that you could fix if you werent too busy searching for attention.