Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పాస్టర్లు చెప్పని బైబిల్ వాక్యాలు -7

విగ్రహాలు,ప్రతిమలు మిమ్మల్ని రక్షించలేవు అంటాడు ఒకసారి, అవి మిమ్మల్ని రక్షిస్తాయి అంటాడు మరో సారి.

క్రైస్తవ మతం విగ్రహారాధనను బద్ద శత్రువు అంటారు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు. కానీ క్రైస్తవుల్లో మెజారిటీ వర్గం (రోమన్ కాథోలిక్స్) విగర్హరాధకులు. క్రైస్తవుల్లో వీరి జనాభా 50% పైనే.

కానీ ఇతర మతాలలో విగ్రహారాధన చేసేవారిపై వీళ్ళు విషం కక్కుతూ ఉంటారు. సొంత మతస్థులు అది కూడా మెజారిటీ జనాభా విగ్రహారాధన చేస్తున్నా నోరు మెదపరు. ఇప్పటికి కొత్త కొత్త విగ్రహాలను స్థాపిస్తున్న క్రైస్తవులను మన దేశంలో చూస్తున్నాం.

ఇక విషయానికి వద్దాం.

బైబిల్ దేవుడు విగ్రహాలను ఎందుకు పూజించవద్దు అన్నాడు ?

కారణం : విగ్రహాలకు ఎటువంటి పవర్స్ లేవు. అవి ప్రజలను ఆపదల నుండి రక్షించలేవు.

ఇది బైబిల్ దేవుడు చెప్పిన మాటే.

మీరు #విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన #ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. (లేవీయకాండము 26:1)

వారు భుజముమీద #దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట #నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని #శ్రమ పోగొట్టి యెవనిని #రక్షింపదు. (యెషయా 46:7)

They lift #it to their shoulders and carry it; they #set it up in its place, and there it stands. From that spot it cannot move. Though one cries out to it, it does not answer; it #cannot #save him from his #troubles. (Isaiah 46:7)

కాబట్టి విగ్రహాలు మీ సమస్యను తీర్చలేవు అని యెహోవా చెప్తున్నాడు.

కానీ ఒక సందర్భంలో ఇదే యెహోవా విగ్రహాలు మిమ్మల్ని రక్షిస్తాయి అని చెప్పాడు. అది ఎలాగో చూడండి.

మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా #యెహోవా నీవు #తాపకరమైన #సర్పము వంటి #ప్రతిమను చేయించి #స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన #ప్రతివాడును దానివైపు చూచి #బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. (సంఖ్యాకాండము 21:8)

And the LORD said unto Moses, “Make thee a fiery serpent, and set it upon a pole. And it shall come to pass that every one who is bitten, when he looketh upon it, shall live.” (Numbers 21:8)

ప్రతిమ/ విగ్రహ రూపంలోని సర్పాలను దర్శిస్తే మరణం నుండి విముక్తి లభించింది అంటే విగ్రహాల వలన ఉపయోగం ఉంది అని యెహోవా ఒప్పుకున్నట్టే కదా !

అవి వారిని రక్షించినట్టే కదా !

ఈ ఆజ్ఞ స్వయంగా యెహోవానే ఇవ్వడం మరింత ఆశ్చర్యం కాదా ?

మనుషులని ఈ సందర్భంలో మాత్రం విగ్రహం ఎలా కాపాడగలిగింది ?

సందర్భం: అన్నం నీళ్లు అడిగిన ప్రజలను పాములతో యెహోవా కరిపించి చంపిస్తాడు. తర్వాత ప్రజలకు ఉపశమనం ఎలా అంటే ? పాముల ప్రతిమలు చేసుకోమని,వాటిని చూసిన వాళ్లకు మృత్యువు ఉండదు అని చెప్తాడు.

డీటెయిల్స్ కోసం ఈ పోస్ట్ ని చదవండి.

https://www.facebook.com/106914574790243/posts/317261507088881/

ఏది ఏమైనా ఇతర మతాల ఆచారాలను అవమానిస్తూ పుస్తకాలు రాయడం, వాళ్ళని చంపడం బైబిల్ కాలం లోనే మొదలైంది అని ఒప్పుకోక తప్పదు. పైగా ఇతరుల ఆచారాలను కించపరిచేలా దేవుడే మాట్లాడాడాడు అని రాసుకోవడం మరో దుర్మరగపుచర్య. అలాగే సొంత మతస్థులు విగ్రహాలను చేసుకొని పూజిస్తూ ఉంటే నోరెత్తకపోవడం క్రైస్తవుల డబల్ స్టాండర్డ్స్ కి నిదర్శనం .

నా అభిప్రాయాలను ఒప్పుకోమని నేను చెప్పను. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బైబిల్ చదవమని మాత్రం చెప్తాను.

మీ రమణ నేషనలిస్ట్

పోస్ట్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. అందరితో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *