Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పాస్టర్లు చెప్పని బైబిల్ వాక్యాలు -11

ఇప్పటి గొఱ్ఱెల కాపరి, ఒకప్పుడు గొఱ్ఱెల వేటగాడు /వేటుగాడు

“గొఱ్ఱెలను నాకు బలిస్తే పాపాలు పోతాయి” అని ప్రజలను మొదట్లో నమ్మించి అనేక సంవత్సరాలపాటు వారి చేత జంతు వధ చేయించాడు యెహోవా/యేసు. జంతువులని ప్రతి అమావాస్యకు, పున్నమికి జంతుబలులు స్వీకరించి చివరకు మనుషులను కూడా బలికి సిద్ధమైన జంతువులతో పోల్చి, వారిని కూడా గొఱ్ఱెలలాగా చంపుతా.. నరుకుతా.. నా కత్తికి నెత్తురు, కొవ్వు అంటించుకుంటా అంటూ మాట్లాడాడు యెహోవా/యేసు.

ఒకప్పుడు మన యేసయ్య చాలా వైలెంట్ గా ఉండేవాడు.

ఇప్పటి యేసు:

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.(యోహాను 10:11)

“I am the good shepherd. The good shepherd lays down his life for the sheep.(John 10:11)

ఒకప్పటి యేసు:

యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును. (యెషయా 34:6)

The sword of the LORD is bathed in blood, it is covered with fat–the blood of lambs and goats, fat from the kidneys of rams. For the LORD has a sacrifice in Bozrah and a great slaughter in Edom. (Isaiah 34:6)

ఇక్కడ యేసు/యెహోవా తన కత్తి/ఖడ్గం జంతువుల రక్తంతో, కొవ్వుతో నిండిపోతుంది అంటున్నాడు. తాను బలితీసుకోబతున్న ఆ జంతువుల పేర్లు గొఱ్ఱెలు, మేకలు, పొట్టేళ్లు.. అని రాసినప్పటికీ అవి మనుషుల గురుంచే. ఇక్కడ యేసు/యెహోవా చెబుతున్నది బొస్రాలో, ఎదోము దేశములో తాను చంపబోతున్న మనుషుల గురుంచి!

మరి మనుషులని జంతువులతో ఎందుకు పోల్చాడు ?

ఎందుకు అంటే ఆయన దృష్టిలో మనుషులు జంతువులతో సమానం కాబట్టి. యెహోవాకు/యేసుకు బలి అనేది కామన్.
గొర్రెలను కాపాడతాను అన్న నోటితోనే గొఱ్ఱెలను చంపుతా అంటున్నాడు. ఏం కాపాడేటప్పుడు జంతువుతో పోల్చితే హ్యాపీ గా ఫీల్ అయినవాళ్లు, చంపేటప్పుడు జంతువుతో పోలిస్తే హ్యాపీ గా ఫీల్ అవ్వరా?

“క్రొవ్వంతా యెహోవాదే ” అంటారు కదా! యెహోవా కత్తికి ఆ కొవ్వు అంటాల్సిందే.

మరి ఇలా హత్యలు చేసే యెహోవా శాంతి దూత ఎలా అయ్యాడు?

జంతువులని బలి తీసుకుని పాపాలు కడుగుతా అని చెప్పిన యెహోవా/యేసు కాలక్రమేణా జంతువుల కోసం ప్రాణం వదిలే స్థితికి ఎందుకు వచ్చాడు ?

ఆ పాత్ర ఎందుకు అలా వినూత్న మలుపు తిరిగిందో బైబిల్ రచయితలకే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *