Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

WOMEN IN THE BIBLE PART-1

WOMEN IN THE BIBLE PART-1 BY RAMANA NATIONALIST

బైబిల్ లో స్త్రీ పార్ట్-1

దేవుడు, మధ్యవర్తి (యేసు), నరుడు, నారీ అనే బైబిల్ వరుస క్రమంలో స్త్రీ ఆఖరి స్థానంలో ఎందుకు ఉంది?

అందరికీ జన్మనిచ్చే స్త్రీని నాలుగో స్థానానికి పరిమితం చేసిన మతం ఏది ?

ఇప్పుడు అదే మతం ఇతర మతాలకు నీతులు ఎందుకు చెప్తోంది?

ఒక పరిశీలన:

4 వ స్థానంలో స్త్రీ

  1. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి స్త్రీ శిరస్సు ఎందుకు కాదు?

ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.(1 కోరింథీయులకు 11:3)

ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. (1 కోరింథీయులకు 11:4)

అంటే స్త్రీకి పురుషుడే యజమాని, మగవాడికి మాత్రం క్రీస్తు యజమాని. కాబట్టి మగవాడు స్త్రీకి యజమాని అని తెలియజేసేందుకు స్త్రీ తన తలపై ఓక ముసుగు ధరించాలి. మగవాడు ముసుగు వేసుకుంటే, ఆ మగవాడు తన శిరస్సు అయిన యేసుని అవమానించినట్టే అంటున్నాడు. స్త్రీ ముసుగు వేసుకోకపోతే ఆమె తన శిరస్సు ఐన మగవాడిని అవమానించినట్టే అంటున్నాడు. మరి స్త్రీ ముసుగు వేసుకుంటే ఎవరికి అవమానం ? ఎవరికీ అది అవమానం కాదు. ఎందుకు అంటే స్త్రీ అందరి కంటే అధమ స్థానంలో ఉంది కాబట్టి. ఆమెకు ముసుగే గౌరవం అంటున్నాడు.

ఒకవేళ తన 4 వ స్థానాన్ని గుర్తు చేసే ముసుగుని స్త్రీ వేసుకోను అంటే ?

గుండు గీయించేయాలి!!!

స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. (1 కోరింథీయులకు 11:6)

ఇంకా…

పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. (1 కోరింథీయులకు 11:7)

పురుషుడు మాత్రమే దేవుడి పోలిక ! దేవుడి మహిమ ? మరి స్త్రీ ?

ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు. (1 కోరింథీయులకు 11:8-9)

మగాడి కోసం స్త్రీ పుట్టిందే తప్ప, స్త్రీ కోసం మగాడు పుట్టలేదు.

అంటే స్త్రీ పుట్టుకకి మగాడే కారణం తప్ప, ఆమె పుట్టుకకి సరైన కారణం లేదు. తన పుట్టుకకు కారణమైన మగాడి అధికారాన్ని స్త్రీ ముసుగు వేసుకోవడం ద్వారా తెలియజేయాలి . ఇంతకంటే స్త్రీజాతికి అవమానం ఏముంటుంది.

అధికార సూచన?

ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద (ముసుగు) ఉండవలెను. (1 కోరింథీయులకు 11:10)

స్త్రీపైన అధికార సూచన అయిన ముసుగుని స్త్రీ తియ్యడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఈ ముసుగు స్త్రీ 4 వ తరగతి (స్థితికి ) చిహ్నం !

ఇంకా ఉంది

…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *