ప్రసంగి అనే బైబిల్ రచయిత ప్రకారం భూమిపైన ఎంత వెతకినా స్త్రీలలో ఒక్క నిజాయితీపరురాలు కూడా కనపడలేదంట! అదృష్టవశాత్తు అతనికి వెయ్యి మంది మగవారిలో వెతికితే ఒక్క నిజాయితీపరుడు కనిపించాడు. THANK GOD !!!
అయితే ఈ నిజాయితీ ఎలాంటి శాస్త్రీయ పద్దతిలో చేశాడో చెప్పేలేదు సగటు బైబిల్ రచయిత. ఆ చిట్కా ఏమిటో చెప్తే ఆడ మగ తేడాలు నిజాయితీని ఎలా డిసైడ్ చేశాయో మనం కూడా తెలుసుకునే వాళ్ళం కదా!
ఛాన్స్ మిస్డ్..!

మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది. అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. (ప్రసంగి 7:26-28)
I find more bitter than death the woman who is a snare, whose heart is a trap and whose hands are chains. The man who pleases God will escape her, but the sinner she will ensnare. “Look,” says the Teacher, “this is what I have discovered: “Adding one thing to another to discover the scheme of things. while I was still searching but not finding–I found one [upright] man among a thousand, but not one [upright] woman among them all. (Ecclesiastes 7:26-28)
మహిళలని మొదటి నుండి చిన్న చూపు చూస్తూనే వచ్చింది బైబిల్. అయితే వాళ్లలో నిజాయితీ లేదు అని ఇక్కడ చెప్పడం మాత్రం ఘోరం. ఎందుకు అంటే తప్పు చేసేవాళ్ళు ఆడ మగ ఇద్దరిలోనూ ఉంటారు అని పోలీస్ రికార్డ్స్ ని బట్టి, మనం చూస్తున్న సమాజ పోకడల్ని బట్టి అర్ధం అవుతూనే ఉంది.
కాబట్టి ఇలాంటి వివక్షా పూరితమైన పదాలు దేవుని వాక్కు అని చెప్పుకునే బైబిల్ లో ఉండటం ఆమోదయోగ్యం కాదు.