Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బాగా నచ్చిన పిల్లాడికి "సమాది అయ్యే" అవకాశాన్ని బహుమతిగా ఇచ్చిన దేవుడు ?

బాగా నచ్చిన పిల్లాడికి "సమాది అయ్యే" అవకాశాన్ని బహుమతిగా ఇచ్చిన దేవుడు ?

బాగా నచ్చిన పిల్లాడికి "సమాది అయ్యే" అవకాశాన్ని బహుమతిగా ఇచ్చిన దేవుడు ? 1 రాజులు 14:13

బాగా నచ్చితే కాపాడాలి కానీ సమాధి అయ్యేలా చేయడం ఏమిటి ?

కొంచెం వివరంగా చెప్పండి మహాప్రభో అని తలలు బాదుకోకండి. పూర్తి కథ చెప్తాను చదవండి.

బైబిల్లోని మొదటి రాజులు 14 వ అధ్యాయంలో ఒక కథ ఉంటుంది.

దాని ప్రకారం దావీదు తర్వాత రాజైన జెరోబోము అనే రాజు యెహోవాకు వ్యతిరేకంగా విగ్రాహారాధన చేస్తాడు. అప్పుడు యెహావాకు చిర్రెత్తుకొస్తుంది. అప్పుడు రాజు కొడుక్కి జబ్బు చేస్తుంది. పిల్లాడి భార్యని రాజుగారు ఒక ప్రవక్త దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు ఆ ముసలి ప్రవక్తకు కళ్లు కనపడవు కానీ, యెహోవా మాటలు ఆకాశం నుండి వినపడి రాజు గారి భార్యకు గుడ్డి ప్రవక్త వార్నింగ్ ఇస్తాడు. యెహోవా ఏం చెప్పాడో as it is గా చెప్తాడు ప్రవక్త రాజు భార్యకు.

అందులో మొదటి మాట:

నీ మొగుడితో ఈ మాట చెప్పు :

నీ కంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసి యున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి యున్నావు. (1 రాజులు 14:9)

“కాబట్టి పిడకలు కాల్చి బూడిడ చేసినట్టు నీ వంశంలోని మగాళ్లందరినీ చంపేస్తాను. నీ బానిసలతో సహా “

కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి,పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును. (1 రాజులు 14:10)

Because of this, I am going to bring disaster on the house of Jeroboam. I will cut off from Jeroboam every last male in Israel–slave or free. I will burn up the house of Jeroboam as one burns dung, until it is all gone.(1 Kings 14:10)

ఇంకా..!

మీ వాళ్ళ శవాలను కుక్కలు, రాబందులు తింటాయి.

పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.(1 రాజులు 14:11)

Dogs will eat those belonging to Jeroboam who die in the city, and the birds of the air will feed on those who die in the country. The LORD has spoken!-(1 Kings 14:11)

మరి నా కొడుకు ?

అక్కడికే వస్తున్నా.. తల్లి. నీ బిడ్డ కూడా చస్తాడు.

కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును. (1 రాజులు 14:12)

నా బిడ్డ చచ్చిపోతాడా ?

అవును చస్తాడు. కానీ నీ కొడుకు దేవుని దృష్టిలో చాలా మంచి వాడు కాబట్టి వాడికి ఒక మంచి ఆఫర్ ఉంది.

ఆఫర్ హా ? ఏమిటి అది ?

ఆగు అమ్మా ఎందుకు కంగారు పడతావు.

మిగతా వాళ్ళ శవాలను కుక్కలు, రాబందులు తింటాయి. నీ కొడుక్కి మాత్రం సమాధి అయ్యే లక్కీ ఛాన్స్

అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. (1 రాజులు 14:13)

ఇంతకీ రాజు గారు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి?

ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.(1 రాజులు 14:15)

And the LORD will strike Israel, so that it will be like a reed swaying in the water. He will uproot Israel from this good land that he gave to their forefathers and scatter them beyond the River, because they provoked the LORD to anger by making Asherah poles. (1 Kings 14:15)

అషేరా దేవత స్థంబాలు నిలబెడితే ఇలా మనుషులని చెంపేయాలా?

సర్లే అనుకుని రాజుగారి భార్య ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది.

ఆ తర్వాత ఏమైంది?

అప్పుడు యరొ బాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను. (1 రాజులు 14:17)

Then Jeroboam-s wife got up and left and went to Tirzah. As soon as she stepped over the threshold of the house, the boy died. (1 Kings 14:17)

ఆమె ఇలా అడుగు పెట్టిందో లేదో ఆ పసిబిడ్డ చనిపోయాడు. అంతా దేవుడి దయ.

దేవుడు ఎంత కరుణామయుడు అంటే కుక్కలు, రాబందులు తినాల్సిన పిల్లాడిని చంపి, సమాధి అయ్యే అవకాశం కల్పించాడు.

వందనాలు వందనాలు.

ఈ కథ కొంచెం దావీదు కొడుకుని యెహోవా చంపడం లాంటిదే. అక్కడ కాంటెక్స్ట్ హిత్తీయురాలితో లైంగిక బంధం, ఇక్కడ కాంటెక్స్ట్ విగ్రహారాధన.
కామన్ పాయింట్ :

తండ్రి యెహోవాకు నచ్చని పని చేయడం.. కొడుకు చావడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *