పరస్పర విరుద్ధ ఆజ్ఞలతో క్రైస్తవలకు నరకం ఫిక్స్ చేసిన యెహోవా
బైబిల్ ప్రకారం, యెహోవా ఆజ్ఞ ను అతిక్రమిస్తే పాపం తగులుతుంది. ఆ పాపం వలన మరణం వస్తుంది.
- పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.(1 యోహాను 3:4)
Everyone who sins breaks the law; in fact, sin is lawlessness. (1 John 3:4)
- ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. (రోమీయులకు 6:23)
For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. (Romans 6:23)
కాబట్టి దేవుని ఆజ్ఞ పాటించకుండా ఉన్నా దానికి వ్యతిరేకంగా పనిచేసినా మరణం తప్పదు. నరకం తప్పదు.
ఈ లెక్కన యెహోవా యొక్క ఏ ఒక్క ఆజ్ఞను క్రైస్తవులు మీరాకుడదు. మీరితే మరణం/నరకం తప్పదు అనుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు తమాషా చూడండి.
- కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
(లేవీయకాండము 19:18)
Do not seek revenge or bear a grudge against one of your people, but love your neighbour as yourself. I am the LORD. (Leviticus 19:18)
ఈ ఆజ్ఞ ప్రకారం అందరినీ పేమించాలి.
మరో ఆజ్ఞ చూడండి.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.(యిర్మియా 48:10)
Cursed be he that doeth the work of the LORD deceitfully, and cursed be he that keepeth back his sword from blood. (Jeremiah 48:10)
ఈ ఆజ్ఞ ప్రకారం యెహోవా కోసం మనుషులను చంపాలి. మనుషులను చంపడానికి ఎత్తిన కత్తిని (ఖడ్గాన్ని ) వెనక్కు తీసేవాడు శాపం పొందుతాడు అంటున్నాడు . అంటే యెహోవా కోసం రక్తపాతం చెయ్యాలి అని ఆజ్ఞ ఇస్తున్నాడు .
….
మొదటి ఆజ్ఞ ప్రకారం పొరుగువారిని ప్రేమించే వాడు ఖచ్చితంగా కత్తితో మనుషులను చంపలేడు. అప్పుడు చంపకుండా కత్తి వెనక్కు తీస్తాడు. ఆజ్ఞ అతిక్రమణ చేస్తాడు. పొరుగువారిని ప్రేమించిన పాపానికి చావుని కొని తెచ్చుకుంటాడు. యెహోవా ఆజ్ఞను మీరినందుకు నరకానికి పోతాడు.
అంటే ప్రతి మనిషి ఈ రెండిట్లో ఒకటి మాత్రమే చేయగలడు. అంటే ప్రతి ఒక్కడూ నరకానికే పోతాడు .
కాబట్టి మనుషులందరూ పాపాత్ములే అని బైబిల్ చెప్పేది నిజమే.
బైబిల్ ప్రకారం ప్రేమించినా, చంపేసినా నరకం అయితే గ్యారంటీ.
కాబట్టి ఇలాంటి గజిబిజి ఆజ్ఞల నుండి కాపాడమని అదే దేవుణ్ణి ప్రార్ధించండి.
ప్రార్ధించండి అయ్యా..!