Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

అన్యులను నపుంసకులతో పోల్చిన యెహోవా

అన్యులను నపుంసకులతో పోల్చిన యెహోవా

జాత్యాహంకార వాదానికి నిర్వచనంలా నిలిచే యెహోవా వాక్యాలు

నన్ను నమ్ముకునే “నపుంసకులను” అన్యులను కూడా నేను ఆశీర్వదిస్తాను.

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు (యెషయా 56:3-4)

Let no foreigner who is bound to the LORD say, “The LORD will surely exclude me from his people.” And let no eunuch complain, “I am only a dry tree.” For this is what the LORD says: I will bless those eunuchs who keep my Sabbath days holy and who choose to do what pleases me and commit their lives to me.(Isaiah 56:3-4)

ఇక్కడ అన్యజాతులకు వాడబడిన పదం eunuch (షండుడు). అంటే నపుంసకుడు అని అర్ధం.

తనను పూజించాలని తన ఆజ్ఞలను పూజించాలని చూసే అన్య జాతుల వారిని నపుంసకులతో పోల్చాడు యెహోవా.

నపుంసకుడు నేను నపుంసకుడిని, యెహోవా నన్ను తన సమూహంలో చేర్చుకోడు అని చెప్పుకున్నట్టు అన్యులు చెప్పుకోవద్దు. నా ఆజ్ఞలు పాటుంచే నపుంసకుల్లాంటి అన్యులను నేను ఆశీర్వదిస్తాను.

అన్యులకు నపుంసకులకు ఉన్న సంబంధం ఏమిటి?

గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. (లేవీయకాండము 21:20)
నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు  యెహోవాను నేనే అని వారితో చెప్పుము. (లేవీయకాండము 21:21)

గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజ ములో చేరకూడదు. (ద్వితీయోపదేశకాండము 23:1)

“If a man’s testicles are crushed or his penis is cut off, he may not be admitted to the assembly of the LORD. ( Deuteronomy 23:1)

కాబట్టి నపుంసకుడు ఎలా అయితే యెహోవా తనను ఆశీర్వదించడు, తన సంఘంలో చేర్చుకోడు అని భావిస్తాడో అలా నపుంసకుల్లాంటి అన్యులు ఎవరైతే తన పరిశుద్ధ దిన నియమాలను పాటిస్తారో, తన ఆజ్ఞలను పాటిస్తారో వాళ్లను కూడా ఆశీర్వాదిస్తాను అని యెహోవా అంటున్నాడు.

నాకు అందరూ సమానమే అంటే సరిపోయే మాటకి నపుంసకులు – ఆశీర్వాదము అనే టాపిక్ యెహోవా ఎందుకు తీసుకువచ్చాడు?

కొత్త నిబంధనలో నాకు కూతురుని స్వస్థత పరుచు అన్నప్పుడు యేసు కుక్క పిల్లలు రొట్టెముక్కల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చాడు?

చచ్చిన జంతు మాంసం కుక్కలకు, అన్యులకు పెట్టమని యెహోవా ఎందుకు చెప్పాడు.

అన్యులు అయిన భారతీయులారా మీకు అర్ధం అవుతోందా?

కాబట్టి spiritual jew అంటే తనను తాను నపుంసకుడు అని ఒప్పుకున్నవాడు

spiritual jew part-2 లో మరిన్ని విషయాలు వివరిస్తాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *