Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చినిగి పోలేదు


నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు. (ద్వితీయోపదేశకాండము 29:5)
During the forty years that I led you through the desert, your clothes did not wear out, nor did the sandals on your feet. (Deuteronomy 29:5)

యెహోవా కొన్ని లక్షల మంది యూదులను ఈజిప్ట్ నుండి తీసుకువచ్చి, వారికి ఇజ్రాయెల్ అనే దేశంలో స్థిర నివాసం కల్పిస్తాను అని మాట ఇచ్చాడు అని బైబిల్ చెప్తోంది. అయితే ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ లో సెటిల్ అయ్యే క్రమంలో ఇజ్రాయెల్ వారు ఎన్నో తప్పులు చేశారు. అందుకు యెహోవా బాగా నొచ్చుకున్నాడు. తప్పులు అంటే ఏవో పెద్ద పెద్ద ముర్డర్లు,మానభంగాలు అనుకునేరు. తాము అంతక ముందు పూజిస్తూ వస్తున్న దేవతల విగ్రహాలు చేసుకోవడం, నంది విగ్రహాలు చేసి పూజించడం, 40 ఏళ్ల పాటు ఎందుకు మా ప్రాణాలు తీస్తున్నావ్, ఇందుకేనా మమ్మల్ని ఇంత దూరం నడిపించావు, కనీశం సరైన తిండి, నీళ్లు లేవు ఇక్కడ, గతంలో మేము తిన్న చేపల కూర, పీతల కూర గుర్తొస్తున్నాయి.. ఇలాంటివి అన్న మాట.

ఈ మహాపాపాలకు కోపపడి యెహోవా వారిని 613 కిలోమీటర్ల దూరాన్ని 40 ఏళ్ల పాటు నడిపించాడు. అదేదో జంతువు ఉంటుంది కదా ఒకటి ఏ దారిన పోతే అన్నీ ఆ దారినే పోతాయి కదా. . దానిలాగా వీరు కూడా వాళ్ల నాయకుడు నడిపించిన దారిలో 40 ఏళ్ల పాటు నడిచారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

40 ఏళ్ల పాటు యూదులను, కొంత మంది వేరే దేశస్తులను కలిపి కొన్ని లక్షల మందిని అడవుల గుండా నడిపించినా ఎవ్వరి చెప్పులూ అరిగిపోలేదంట, ఎవరి బట్టలు చిరిగిపోలేదంట. అబ్బా ఎంత గొప్ప విషయమో కదా ! అంటే 40 ఏళ్లలో ఆ ప్రజలు ఎన్ని సార్లు స్నానాలు చేసి ఉంటారు. ఎన్ని సార్లు బట్టలు విప్పి కట్టుకొని ఉంటారు. అయినా బట్టలు పాతబడిపోయి, చిరిగిపోలేదు అంటే ఇది చాలా గొప్ప విషయమే!

ఇది నమ్మెటట్లు ఉందా? నవ్వుకునేటట్లు ఉందా?

ఇక్కడ యెహోవా సాధించినది ఏమిటి?

తాను ఎంత కఠినాత్ముడినో తెలియజేయడం కోసం కొందరు బానిసలపై యెహోవా పెట్టిన హింసలా లేదూ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *