Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

Jephthah’s daughter human sacrifice

Jephthah’s daughter human sacrifice

యెఫ్తా కూతురి దహన బలి Jephthah’s daughter human sacrifice

యెఫ్తా కూతురిని బలి ఇమ్మని అడిగింది ఏ దేవుడు?

క్లూ: యెఫ్తాని అవహించిన యెహోవా ఆత్మ!

ఈ సంఘటన బైబిల్లో నరబలి ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

Context:

యెప్తా శతృవులు యెప్తా మాట వినడం లేదు. అప్పుడు యెహోవా ఆత్మ యెప్తా మీదకి వచ్చింది. శతృవులను ఓడించడంలొ సహాయం చేస్తే దహన బలి అర్పిస్తా అని యెప్తా యెహోవాకి మొక్కుకున్నాడు.

న్యాయాధిపతులు 11:28-31

అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొన లేదు.
యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.
అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

ఇంటికి వెళ్లేసరికి ఏది ఎదురైతే దాన్ని యెహోవాకి దహన బలిగా ఇస్తానని మొక్కు కోగానే యెప్తాని విజయం వరించింది

న్యాయాధిపతులు 11:32-34
అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరా మీము వరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

అయితే యప్తా ఇల్లు చేరేసరికి అతని కూతురు అతనికి ఎదురుగా వచ్చింది.కానీ యెహోవాకి మాట ఇచ్చాను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదని యెప్తా కూతురితో తెగేసి చెప్పాడు.

న్యాయాధిపతులు 11:34-35
యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.
కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపు కొని అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా…

దాంతో కూతురు సరే అంది. కానీ 2 months time అడిగింది. సరే అన్నాడు తండ్రి.

న్యాయాధిపతులు 11:36-38
ఆమెనా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీ యులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితో ననెను.మరియు ఆమె-నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా.అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండలమీద తన కన్యా త్వమునుగూర్చి ప్రలాపించెను.

2 నెలల తరువాత కూతురు తిరిగి రాగానే కూతురుని యెప్తా బలి ఇచ్చేశాడు యెహోవాకి.

న్యాయాధిపతులు 11:39

ఆ రెండు నెలల అంత మున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.

న్యాయాధిపతులు 11:40
ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రా యేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థు డైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుట కద్దు.

So, బైబిల్లో యెప్తా తన కూతుర్ని యెహోవాకి బలిచ్చాడు అని క్లియర్ గా ఉంది.

అయితే కొందరు ఇందులో చెప్పబడినట్టు నరబలి జరగలేదు అని వాదిస్తారు. బైబిల్ లో నరబలి లేనేలేదు అంటారు. ఆమెని గుడికి అంకితం చేశాడు అంటారు. కానీ అది నిజం కాదు.

ఇదిగో Solid evidence.

Evidence-1

But nothing that a person owns and devotes to the LORD–whether a human being or an animal or family land–may be sold or redeemed; everything so devoted is most holy to the LORD.
“‘No person devoted to destruction may be ransomed; they are to be put to death.

(Leviticus 27:28-29)

ఒకసారి యెహోవాకి ప్రతిష్టిస్తే జంతువైనా మనిషైనా చంపబడాల్సిందే అని యెహోవానే చెప్తున్నాడు.

Evidence-2

కన్న కూతురు కనపడగానే యెప్తా బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకోవడం అయినవాళ్ల చావుకి గుర్తు. చాలా సార్లు మీ అయిన వాళ్ళు చనిపోయినా బట్టలు చింపుకోవద్దు అంటాడు యెహోవా వ్రతం నియమాలు చెప్తూ. So, అలా చింపుకోవడం చావుకి గుర్తు.

Evidence-3
యెప్తా శత్రువులపై ఊగిపోయి యుద్దానికి వెళ్లే ముందు యెహోవా ఆత్మ అతన్ని పూనింది. తరువాతనే అతను మొక్కుకున్నాడు. కాబట్టి ఇదంతా యెహోవా ప్లాన్ లో భాగమే. బలి ఇస్తాను అనగానే యెప్తా కి శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు. దేవుడు సర్వజ్నుడు కాబట్టి యెప్తా కూతురు ఎదురయ్యి బలి అవుతుంది అని అతనికి ముందే తెలుసు. కాబట్టి ఈ నరబలి యెహోవాకి ఇష్టమే.

Evidence -4
అబ్రాహాము కొడుకుని బలి అడిగిన యెహోవా తరవాత ఆఖరి నిమిషం బలి వద్దులే అన్నాడు. కానీ ఇక్కడ ఎక్కడా అలాంటి అన్నట్టు రాయబడలేదు. పైగా బలి ఇస్తాను అనగానే సహాయం చేశాడు. యెహోవా పూనడం వల్లనే మొక్కుకోవడం కూడా జరిగింది. పైగా అప్పటికే ఎంతో మంది పసిపిల్లలను, స్త్రీలను చంపిన యెహోవా యెప్తా కూతురుని బలి తీసుకుంటాడా లేదా అని ఆలోచించడం అమాయకత్వమే కదా!

Evidence -5
యెప్తా కూతురికి జరిగిన దాని గురించి ఇజ్రాయెల్ ప్రజలు ప్రతీ సంవత్సరం గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు అని ఉంది. కేవలం కన్యగానే ఉండిపోతే ఇంత బాధ అవసరం లేదు. ఎందరో స్త్రీలు అప్పటి కాలంలో ఆలయాల్లో ఉండేవారు. ఆమె బలి అయ్యింది కాబట్టే అంత బాధ పడుతూ ఉన్నారు.

కాబట్టి యెప్తా తన కన్న కూతుర్ని యెహోవాకి బలి ఇచ్చాడు. అది కూడా యెహోవా అంగీకారంతోనే అని బల్ల గుద్ది చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు క్రైస్తవులు ఏం చెప్తారంటే..

కొన్ని వచనాల్లో నరబలి వద్దని ఉంది అని. నాయనా ఒకచోట ఒకలాగా మరోచోట ఇంకోలాగా రాసుకోవడమే బైబిల్ యొక్క ప్రత్యేకత.
జంతు బలి ఇమ్మని ఒకచోట, వద్దని ఇంకోచోట.
పరిశుద్ధ దినం పాటించకపోతే మనిషిని చంపినట్టు ఒకచోట, పరిశుద్ధ దినం అవసరం లేదని ఇంకోచోట రాసుకోవడం మీకు తెలుసు కదా.
ఈ విషయంపై పూర్తి అవగాహన కోసం ఇచ్చిన రిఫరెన్స్లను బైబిల్ నుండి చదువుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *