నమస్తే అండి. నేను ‘మీ బైబిల్ ఎక్స్పోజర్’!
బైబిల్‌ను అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. బైబిల్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమైన కొందరు పాస్టర్లు, తాము మునిగిపోవడమే కాకుండా, అన్యులను కూడా నిండా ముంచేందుకు తమకున్న అరకొర బైబిల్ జ్ఞానాన్ని ఉపయోగించి మత మార్పిడి వలలు విసురుతూ ఉంటారు. వారి నుండి పాఠకులను రక్షించి, మతమార్పిడి అనే రక్కసి నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలాగో నేర్పే వెబ్‌సైట్ ఇది.
తెలుగు బైబిల్లో వాడబడిన భాష, అలాగే పాస్టర్ల ఊకదంపుడు ప్రసంగాల వలన గందరగోళానికి గురైన బైబిల్ పాఠకుల కోసం ఈ వెబ్‌సైట్ సరళమైన తెలుగులో నిర్మించబడింది. తెలుగులో అందుబాటులో ఉన్న మొట్టమొదటి విమర్శనాత్మక వెబ్‌సైట్ ఇదే కావడం విశేషం.
గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా (Facebook, Instagram మరియు YouTube) వేదికగా బైబిల్ పైన పోస్టులు పెడుతూ, బైబిల్‌ను విశ్లేషిస్తూ మీ అందరికీ సుపరిచితుడనైన మీ బైబిల్ ఎక్స్పోజర్ రాసిన అనేక వ్యాసాల సమాహారమే ఈ వెబ్‌సైట్.
బైబిల్‌లో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి మర్మం తెలుగు పాఠకులకు పరిచయం చేయాలి అనే సదుద్దేశంతో ఎంతో శ్రమతో, ఖర్చుతో నేను తయారుచేసిన ఈ వెబ్‌సైట్ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను.
బైబిల్ పూర్తిగా చదవని చాలా మంది బైబిల్ పై ఎన్నో కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి నుండి రాబోయే తరాలను కాపాడుకునే ప్రయత్నంలో ఒక అడుగుగా నా వెబ్‌సైట్ ఉంటుందని ఆశిస్తున్నాను.
ఈ వెబ్‌సైట్ ప్రత్యేకతలు:
- మీకు నచ్చిన పోస్టులను ఏదైనా ఒక పదం లేదా పేరుతో ‘Search’ (వెతుకు) ఆప్షన్‌లో వెతకవచ్చు. ఉదాహరణకు: మీకు లోతు కథ గురించి తెలియాలి అంటే “లోతు” అని సెర్చ్ ఆప్షన్‌లో రాయండి. లేదా ‘Lot’ అని రాయండి. మీకు పూర్తి వివరాలు లింక్స్ రూపంలో కనిపిస్తాయి. క్లిక్ చేసి చదువుకోండి.(సవరణ: ‘పట్వెటుకోవచ్తచు’ అనేది ‘వెతకవచ్చు’ లేదా ‘పొందవచ్చు’ అని మార్చబడింది.)
- మీకు ఏదైనా ఒక విషయంపై సందేహం ఉంటే, కుడి పక్కన కింద ఉన్న పచ్చని WhatsApp బటన్ కనిపిస్తుంది. అక్కడ నొక్కి నాతో నేరుగా చాటింగ్ చేసి సమాచారాన్ని పొందవచ్చు.
- వెబ్‌సైట్‌లోనే కాక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మన చానల్ ను ఫాలో అవ్వవచ్చు. వెబ్‌సైట్‌లో ఆ లింకులు కూడా ఇచ్చాను. చూడండి.
మీకు తెలుసు, వెబ్‌సైట్ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. ఈ వెబ్‌సైట్‌ను నేను నా సొంత నిధులతో తయారుచేశాను. నా కృషిని అభినందిస్తే, ఈ వెబ్‌సైట్‌ను మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయండి.
అలాగే వెబ్‌సైట్ నిర్వహణ కోసం వీలైతే సహాయం చేయండి.
Bible Exposer వెబ్‌సైట్‌కి సహాయం చేయాలనుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా donate చేయగలరు.
ధన్యవాదములు.
మీ బైబిల్ ఎక్స్పోజర్
contact:
BibleXposer Facebook Page