Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్లో ఆరుగురు పతివ్రతలు

బైబిల్ దేవునిచే అమోదించబడిన ఆరుగురు పతివ్రతలు ఎవరు అని వెతకగా బైబిల్ చెప్పే సమాధానం ఇలా ఉంది.

  1. తామార్
    చర్య: తన మామ యూదాతో వేశ్య వేషంలో లైంగిక సంబంధం కలిగి గర్భవతి అయింది.
    దేవుని స్పందన: శిక్షించలేదు. యూదా ఆమెను “తాను నన్ను మించిన న్యాయవంతురాలు” అన్నాడు.
    ప్రతిష్ట: యేసు పుట్టిన దావీదు రాజు వంశ పరిచారిక.

    యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు. (ఆదికాండము 38:26 )

    ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి. (రూతు 4:12)
  2. బత్షేబా
    చర్య: మొగుడు బతికి ఉండగానే రాజు గారితో శృంగారంలో పాల్గొన్నది. భర్త చావుకి కారణమైంది.
    దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను. (2 సమూయేలు 11:4)
    దేవుని స్పందన: శిక్ష దావీదుకే వచ్చింది; బత్షేబాకు శిక్ష లేదు.
    ప్రతిష్ట: సొలొమోను తల్లి.
  3. లోతు పెద్ద కుమార్తె
    చర్య: తండ్రిని మద్యం తాగించి, అతనితో లైంగిక సంబంధం కలిగి మోవాబ్ జనులకు జనని అయింది.
    మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. (ఆదికాండము 19:32)
    నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. (ఆదికాండము 19:33-34)
    దేవుని స్పందన: శిక్షించలేదు.
    ప్రతిష్ట: మోయాబు ప్రజల తల్లి.
  4. లోతు చిన్న కుమార్తె
    చర్య: తన అక్క పద్ధతిలో తండ్రితో లైంగిక సంబంధం కలిగి అమ్మోనీయుల తల్లి అయింది.

ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. (ఆదికాండము 19:35)
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. (ఆదికాండము 19:36)
దేవుని స్పందన: శిక్షించలేదు.
ప్రతిష్ట: అమ్మోను ప్రజల తల్లి.

  1. శారా
    చర్య: తన సోదరుడైన అబ్రాహాముని పెళ్లి చేసుకుంది.

అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.(ఆదికాండము 20:12)
దేవుని స్పందన: శిక్ష లేదు, విమర్శ కూడా లేదు.
ప్రతిష్ట: ఇశ్రాయేలు జాతి తల్లి.

  1. యోకెబెదు (మోషే తల్లి)
    చర్య: తన సోదరుడి కుమారుడైన అమ్రాము అనే మేనల్లుడిని పెళ్లి చేసుకుంది (అంటే తన సోదరుని కుమారుడు = మేనల్లుడు).
    అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. (నిర్గమకాండము 6:20)
    దేవుని స్పందన: శిక్ష లేదు.
    ప్రతిష్ట: మోషే, అహరోను, మరియమ్మ తల్లి.

    గమనిక బైబిల్లో ఎందరో పతివ్రతలున్నారు. అందరి గురించి చర్చించడానికి మన సమయం సరిపోదు. అందుకే కేవలం ఉత్తమ ఆరుగురిని (టాప్-6) మాత్రమే ఇవ్వడం జరిగింది.

    పైన పేర్కొన్న ఉదాహరణలు మానవులు తమ స్వబుద్దితో చేసినవి తప్ప అందులో దేవుని ప్రమేయం లేదు అని కొందరు వాదిస్తారేమో. కావచ్చు. కానీ ఎక్కడా ఈ పతివ్రతలకు శిక్షలు పడినట్టు బైబిల్ పేర్కొనలేదు. పైగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అని చెబుతోంది. నిజానికి కొందరు పతివ్రతలకు దేవుడు దగ్గర ఉండి పెళ్ళిళ్ళు కూడా చేయించాడు.
    యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ #తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి. (సంఖ్యాకాండము 36:10-11 )
    ఇక్కడ తన చిన్నాన్న పెదనాన్న పిల్లల్ని అనగా వారి సొంత గోత్రంలోని అన్నదమ్ములను ఈ పతివ్రతలు పెళ్ళాడారు. అది కూడా దేవుడి పర్యవేక్షణలో!

    కాబట్టి వీళ్ళంతా పతివ్రతలే అని ఒప్పుకోక తప్పడం లేదు.
    కాబట్టి నేను చెప్పేది “బైబిల్లో ఎందరో పతివ్రతలు అందరికీ వందనాలు!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *