
చంపమంటే చంపాలి, కొట్టమంటే కొట్టాలి.. నో అంటే నెక్స్ట్ బర్త్ డే ఉండదు!
యెహోవా చేసిన లక్షల కొద్దీ హత్యల లిస్టులో ఒకటి ఇప్పుడు మనం చర్చించబోతున్న హత్య.
యెహోవా ఎవరిని చంపినా ఒక కారణం ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కారణం కొంచెం విచిత్రంగా ఉంటుంది. అందుకే మొదటి భాగంలో చర్చకు వచ్చింది.
ఈ క్రింది ఉదాహరణలో ఒక మిత్రుడు యెహోవా ఆజ్ఞ చేత నన్ను కొట్టు అంటాడు. మిత్రుడు కొట్టడు. అంతే అతన్ని సింహం తినేస్తుంది. లేదు లేదు యెహోవాయే తినిపించాడు సింహం చేత.
అంటే యెహోవా నామంలో ఒక ఆజ్ఞ ఎవరైనా ఇస్తే ఆ ఆజ్ఞను మనం ఖచ్చితంగా పాటించాలి. అది చిన్నది అయినా పెద్దది అయినా. లేదంటే యెహోవా వేసే శిక్ష అత్యంత భయంకరంగా ఉంటుంది.
ఈ బైబిల్ రెఫెరెన్సులు చూడండి.
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితోనన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడక పోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను. (1 రాజులు 20:35-36)
కాబట్టి యెహోవా చంపమంటే చంపాలి. లేదంటే మరణ శిక్షకు సిద్ధంగా ఉండాలి. అంతే!
మరో బైబిల్ వాక్యం కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తోంది.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. (యిర్మియా 48:10)
“క్రూసేడులు” లేదా “క్రైస్తవ మత దాడులలో సదరు క్రైస్తవులు ఇదే నియమాన్ని పాటించి యెహోవా కోసం అన్యుల రక్తాలు పారించారు. లేదంటే యెహోవా చంపేస్తాడు అనే భయం. ఈ భయానికి మరోపేరు మతోన్మాదం.
ఇకా మరో రక్తసిక్తమైన బైబిల్ సంఘటనతో (రక్త సువార్త-2) మళ్లీ కలుద్దాం.
Good job anna. Mana anni communities lo e link post cheyyandi. Inka easy ga referance lu pettandi jaihind. 🚩