లోతు భార్యను గుర్తు పెట్టుకోండి, యేసును మర్చిపోండి!
ఎందుకు అంటే యేసు కొత్త నిబంధనలో ఇలా అన్నాడు.
లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. (లూకా 17:32)
ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును (రాబందులు) పోగవునని వారితో చెప్పెను. (లూకా 17:37)
“Where, Lord?” they asked. He replied, “Where there is a dead body, there the vultures will gather.” (Luke 17:37)
యేసు చెప్పిన ఈ మాటలకు అర్ధం ఏమిటి? పీనుగు ఎవరు? రాబందులు ఎవరు?
తెలియాలంటే మీకు పాత నిబంధనలోని లోతు కథ తెలియాలి. అలాగే నోవాహు జలప్రళయం కధ కూడా తెలియాలి..
ఇక్కడ “పీనుగు” అంటే యెహోవాపైన విశ్వాసం లేని మనిషి. అంటే యెహోవా పైన విశ్వాసం లేని వాడు, యెహోవా మాటకు వ్యతిరేకంగా నడిచేవాడు, భూలోకపు సంబంధాలకు విలువ ఇచ్చే వాడు.. వీళ్లంతా యేసు రెండవ రాకడలో యెహోవా చేతిలో చనిపోబోతున్నారు అని యేసు చెప్తున్నాడు.
ఈ వాక్యాన్ని క్రైస్తవులు ఎక్కువగా ప్రస్తావించరు. ఎందుకు అంటే ఇది యేసు యొక్క అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. యేసు అమాయకుడు, యెహోవా క్రూరుడు అనుకునే చాలామందికి ఈ వాక్యం ఒక కనువిప్పు. పాపుల కోసం యేసు చనిపోలేదు. పాపులను చంపడానికి యేసు వచ్చాడు అని చెప్పే వాక్యాల్లో ఇది అతి ముఖ్యమైనది.
మరో వాక్యాన్ని కూడా చూడండి:
నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. (లూకా 17:26)
నోవహు దినములలో ఏం జరిగింది ?
లోకం పాపంతో నిండిపోయింది అని చెప్పి యెహోవా మానవులందరినీ (ఒక 10 మందిని తప్ప) చంపేశాడు.
లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. (లూకా 17:28)
లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. (లూకా 17:32)
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును.
లోతు దినములలో ఏం జరిగింది?
తన కుటుంబ సభ్యులు, ఆస్తిపాస్తులు అన్నీ యెహోవా కురిపించిన గంధక వర్షంలో కాలి బూడిద అవుతుంటే తట్టుకోలేక బాధతో వెనక్కు తిరిగిన లోతు భార్య చనిపోయింది(యెహోవా శాపం వలన ఉప్పు స్తంబమై). యెహోవా మాట విన్న లోతు , లోతు కూతుళ్లు బతికారు..! ఆమె చేసిన పాపం ఏమిటి? మాట వినకపోవడమే.
అంటే యెహోవా మాట వింటే చాలు. వాళ్లే పరలోకం వెళ్తారు. కూతుళ్లతో సెక్స్ చేసినా, తండ్రితో సెక్స్ చేసినా నో ప్రాబ్లం. వాళ్ళను యెహోవా రక్షిస్తాడు.
ఇలా ఎందుకు అంటున్నాను అంటే లోతు విషయంలో జరిగినట్టే మళ్ళీ జరగబోతోంది అంటున్నాడు యేసు. అంటే యెహోవా చేసిన పనిని యేసు సమర్దిస్తున్నాడు.
నోవహు అనే పచ్చి తాగుబోతు కూడా యెహోవా దృష్టిలో నీతిమంతుడే. కాబట్టి ఇక్కడ గుణ గణాలను బట్టి కాక యెహోవాను నమ్మడం, అతని మాట వినడమే “నీతి” అని యేసు కూడా బల్ల గుద్ది చెప్పినట్టు అయ్యింది .
అంటే మనుషులను నీటిలో ముంచి యెహోవా చంపేయడం, ఊర్లకు ఊర్లను తగలబెట్టి మనుషులను సజీవ దహనం చెయ్యడం యేసుకూడా సమర్ధించినట్టు అయ్యింది.
అమాయకురాలైన లోతు భార్యలాగే మరో ఎందరో యేసు రెండవ రాకడలో అవిశ్వాసులు అనే కారణంతో యేసు/ యెహోవా చేతిలో చావడం తప్పదు అని, అప్పుడు ఒక శవాన్ని తినడానికి రాబందులు చేరినట్టు, యెహోవా తనని నమ్మని వాళ్ళని చంపబోవడం సబబే అని కరుణామయుడు ఐన యేసు గారు చెప్పారు.
ఇదే ఈ వాక్యానికి అసలైన అర్ధం.
ఇప్పడు చెప్పండి. యేసయ్య కరుణామయుడా? యెహోవా లాగే అయన కూడా క్రూరుడే. కాబట్టి లోతు భార్యను గుర్తు పెట్టుకోండి. యేసును మర్చిపోండి.