అన్నీ మీరే చేశారు – ఇట్లు ఈజిప్ట్ ప్రజలు
కథ , మాటలు, పాటలు, ఫైట్లు, కెమెరా, దర్శకత్వం-యెహోవా
దేవుడు డైరెక్టర్ – ఫరో విలన్ – ఈజిప్టీయులు జూనియర్ ఆర్టిస్టులు
1. ఓపెనింగ్ సీన్:
లైట్స్… కెమెరా… యాక్షన్!
డైరెక్టర్ దేవుడు తన సెట్‌ని రెడీ చేసుకున్నాడు.
- హీరో: ఇశ్రాయేలీయులు (సాడ్, దుఃఖంలో, గ్యాప్ సాంగ్స్ కోసం రెడీ)
- విలన్: ఫరో (కానీ ఇది విలన్ by choice కాదు, “direction” వల్లే)
- జూనియర్ ఆర్టిస్టులు: ఈజిప్టీయన్లు (నిస్సహాయంగా కేకలు వేసే background people)
🎬 2. స్క్రిప్ట్ ట్విస్ట్:
ఫరో actually “సరే పోతే పొండి” అనాలనుకున్నా…
డైరెక్టర్ దేవుడు కట్ కొట్టేస్తాడు –
👉 “అయ్యో! ఇది climax కి సరిగ్గా రావాలి. Audience కి నా పవర్ చూపించాలి. So ఫరో, నేను నీ హృదయాన్ని పరుచుకోవాలి అన్నాడు”
🟢 ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి ఒప్పుకున్న సందర్భాలు
నిర్గమకాండము 8:8 – కప్పల శాపం తర్వాత:
“యెహోవాను ప్రార్థింపవలెనని చెప్పుము… అప్పుడు నేను ప్రజలను విడువుదును.”
నిర్గమకాండము 8:28 – ఈగల శాపం తర్వాత:
“నేను మిమ్మును విడువుదును, అరణ్యములో మీ దేవుని యెహోవాకు బలి అర్పించుడి.”
నిర్గమకాండము 9:27–28 – మంచు వర్షం తర్వాత:
“ఈ సారి నేను పాపము చేసితిని; యెహోవా నీతిమంతుడు… ఈ సారి నేను మిమ్మును విడువుదును.”
నిర్గమకాండము 10:7–8 – మంత్రులు ఒత్తిడి చేసినప్పుడు:
“పొండి, మీ దేవుని యెహోవాను సేవించుడి.”
నిర్గమకాండము 10:24 – చీకటి శాపం తర్వాత:
“పొండి, యెహోవాను సేవించుడి; అయితే మీ గొఱ్ఱెలు, పశువులు ఉండిపోవలెను.”
నిర్గమకాండము 12:31 – తొలకోడలు మరణం తర్వాత:
“లేచి నా ప్రజల మధ్య నుండి వెళ్లిపోండి… యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు.”
🔴 దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసిన సందర్భాలు
నిర్గమకాండము 4:21 – ఇంకా ఏ శాపం రాకముందే:
“నేను అతని హృదయమును కఠినపరచుదును, అతడు ప్రజలను విడువడు.”
నిర్గమకాండము 7:3 – రక్త శాపానికి ముందు:
“నేను ఫరో హృదయమును కఠినపరచెదను, నా సూచకములు విస్తరించెదను.”
నిర్గమకాండము 9:12 – మంటల శాపం తర్వాత:
“యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారిని ఆలకించలేదు.”
నిర్గమకాండము 10:1 – మిడతల శాపానికి ముందు:
“నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయమును కఠినపరచితిని.”
నిర్గమకాండము 10:20 – మిడతల శాపం తర్వాత:
“యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ప్రజలను విడువలేదు.”
నిర్గమకాండము 10:27 – చీకటి శాపం తర్వాత:
“యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు వారిని విడువలేదు.”
నిర్గమకాండము 11:10 – చివరి శాపానికి ముందు:
“యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను విడువలేదు.”
నిర్గమకాండము 14:8 – ఎర్ర సముద్రం వెంబడి వెళ్ళే ముందు:
“యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను వెంబడించెను.”
⚖️ సంక్షిప్తం:
ఫరో కనీసం 6 సార్లు ఒప్పుకున్నాడు లేదా విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు.
దేవుడు 8 సార్లు అతని మనసు కఠినపరచాడు — అది కూడా మొదట్నుంచే ప్లాన్ చేసి.
అందుకే విమర్శకులు అంటారు: ఇది “దేవుడు రెండు వైపులా ఆట ఆడుతున్న గేమ్”, లేదా “డివైన్ సాడిజం.”
3. యాక్షన్ సీన్స్: “ప్లేగ్ ఫైట్స్”
ఇప్పుడు డైరెక్టర్ స్టంట్ మాస్టర్ కూడా:
- Scene 1️⃣: నీటిని రక్తం → జూనియర్ ఆర్టిస్టులు నీళ్లు తాగలేక దాహంతో నోరూర్చడం.
- Scene 2️⃣: బల్లులు, ఈగలు → కీచకుడి పట్టు లాగా ఎక్కడికక్కడా కీటకాల వర్షం.
- Scene 3️⃣: పశువుల మరణం → రైతులు కంటతడి, కాని స్క్రిప్ట్‌లో emotion shot మాత్రమే.
- Scene 4️⃣: ఉరుములు, వడగళ్ల వాన → పంటల నాశనం → జూనియర్ ఆర్టిస్టులు పడిపడిపోడం.
- Scene 5️⃣: మిడతల దండు → ఫుడ్ scarcityకి pan shots.
- Climax Scene 🔥: మొదటి సంతానం మరణం – crying shots, bgm slow-motion, horror tone.
Audience: “ఎంత cruel climax రా బాబోయ్!”
4. దేవుడు – ఓవర్ హీరో ఎంట్రీ
సినిమా climaxలో డైరెక్టర్ గాడ్ తన పవర్‌ని flex చేస్తాడు:
- “చూశారా! ఇదే నా శక్తి.”
- (Exodus 9:16 – “నా పేరు భూమి అంతట తెలిసికొనుటకై నేను నిన్ను నిలిపితిని.”)
👉 అంటే అసలు movie సారాంశం: God’s brand promotion.
🎭 5. ఫరో – పప్పు విలన్
ఫరోకి అసలు screen presence లేదు.
అతని dialogueలు, decisionలు, expressions అన్నీ డైరెక్టర్ చేతిలో.
👉 వాడిని puppetలా వాడుకుని విలన్‌గా stamp చేశాడు.
Public review: “ఫరో కన్నా గాడ్ కఠినంగా ఉన్నాడు కదా?”
⚰️ 6. జూనియర్ ఆర్టిస్టుల ఫేట్
పాపం ఆ జూనియర్ ఆర్టిస్టులు (ఈజిప్టీయులు) –
- ఎవరూ major dialogues కూడా లేవు.
- ఎవరు తప్పు చేయలేదు.
- కానీ torture, death, tragedy అన్నీ వాళ్లపైనే.
👉 చివరికి వాళ్లే అసలు victims.
🎬 7. ఎండింగ్ క్రెడిట్స్
Movie Title: “రక్త సువార్త: Sadism of God”
- Screenplay: దేవుడు
- Director: దేవుడు
- Villain: ఫరో (by force)
- Hero: దేవుడు (తానే సమస్య create చేసి, తానే solution hero)
- Victims: ఈజిప్టు ప్రజలు (Collateral Damage crew)
🩸 8. ఫైనల్ రివ్యూ
Critics say:
- ఇది redemption story కాదు, ఇది brand-building sadistic drama.
- ఫరో blame తిన్నాడు, కానీ mastermind దేవుడే.
- Audience takeaway: “God killed innocents… just to market himself.”
ఫైనల్ గా ఒక మాట:
నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను. (యెషయా 45:7)
I form the light, and create darkness; I make peace, and create evil; I, the LORD, do all these things. (Isaiah 45:7)
అంటే మొత్తం ఆయనే చేస్తాడు. ప్రజలు అంతా v p లే!