“పోస్ట్ పూర్తిగా చదివి షేర్ చేయగలరు”
ఈ మధ్యనే క్రైస్తవులపై కొందరు మతోన్మాదులు చేసిన దాడి నా మనసును అత్యంత దారుణంగా కలచి వేచింది. ఇక్కడ మీరు అంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మతోన్మాదానికి మతంతో సంబంధం లేదు. సాధారణంగా ఒక మతంలో ఉన్న కొందరు దాడి చేసినప్పుడు బాధిత పక్షం వారు మాత్రమే సపోర్ట్ చేస్తారు. కానీ మనం అలా కాదు. తప్పు ఎవరు చేసినా తప్పు అనే చెప్పాలి. ఒక వర్గంపై దాడి చేయడం ఖచ్చితంగా తప్పే,
మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి 3 ఉత్తమ మార్గాలు ఉన్నాయి.
1. మొదటి పద్ధతి (యెహోవా పద్ధతి)
పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలీయులకు న్యాయం మరియు రక్షణ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.
- కంటికి కన్ను (Lex Talionis): నిర్గమకాండము 21:24 ప్రకారం “కంటికి కన్ను, పంటికి పన్ను” అనే నియమం పాటించాలి. శిక్ష అనేది నేరానికి సమానంగా ఉండాలని ఇది చెబుతుంది. అంటే దాడి చేసిన వారిపై మనం కూడా దాడి చెయ్యాలి.
- యెహోవా యుద్ధం చేస్తాడు: “యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను” (నిర్గమకాండము 14:14). అంటే అన్యాయం జరిగినప్పుడు దేవుని న్యాయ తీర్పుపై నమ్మకం ఉంచాలి.
- ప్రతీకారం నాది: “ప్రతీకారము చేయుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును” (ద్వితీయోపదేశకాండము 32:35). మనుషులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, దేవుడు ఇచ్చే న్యాయం కోసం వేచి చూడటం.
- మత ప్రచార వ్యతిరేక చట్టం : “మత ప్రచారం చేసే వారిని చంపేయండి”
- భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. (ద్వితీయోపదేశకాండము 13:7-9)
- ఆచరణ: 850 మంది ఇతర దేవతల ప్రవక్తలని చంపిన యెహోవా యొక్క ప్రవక్త ఏలీయా. బాల్ మరియు అశీరా దేవత అనే ఇద్దరు దేవతలను పూజిస్తున్నారు అనే కారణం చేత , ఆయా దేవతలకి ప్రవక్తలుగా ఉన్నారనే కారణం చేత ఈ 850 మందిని ఏలీయా అత్యంత దారుణంగా చంపేస్తాడు.
- అప్పుడు ఏలీయా ఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. (1 రాజులు 18:40)
- ఇతర దేవతల ఆలయాల కూల్చివేత:
1. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.(యెహెఙ్కేలు 30:13)
2. మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.(ద్వితీయోపదేశకాండము 12:2).
3. యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. (నిర్గమకాండము 22:20)
ఇలాంటి ఆజ్ఞలు పొందిన ఇజ్రాయెల్ ప్రజలు ఇతర దేవతలను పూజించేవాళ్లాను చంపక ఏం చేస్తారు.
టెంపుల్ ని టాయిలెట్ గా మార్చిన క్రైస్తవులు- సందర్భం:
అయితే ఇవన్నీ అన్యులు క్రైస్తవులను ఎటాక్ చేసినప్పుడు అనుకుంటున్నారా ? కాదు ఇక్కడ యెహోవా వర్గం ఇతరులపై దాడి చేయడం గురించి ఉంది. కాబట్టి ఈ పద్ధతి ఇక్కడ work అవుట్ కాకపోవచ్చు.
2. యేసు పద్ధతి: ప్రేమ మరియు క్షమ
యేసు క్రీస్తు అన్యాయాన్ని ఎదిరించడంలో ఒక అత్యన్నతమైన, నైతిక మార్గాన్ని చూపారు. ఇది బలహీనత కాదు, ఆత్మస్థైర్యంతో కూడిన స్పందన.
యేసు పద్ధతి: హింసలో ఆనందించడం
శత్రువులు దాడి చేసినప్పుడు కుంగిపోకుండా, అది ఒక ధన్యతగా భావించాలని బైబిల్ బోధిస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రిఫరెన్స్‌లు:
- పరలోకంలో గొప్ప ఫలం: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:11-12)
- శ్రమలలో అతిశయపడటం: “అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరుగుదుము; కాబట్టి శ్రమలయందును అతిశయపడుదము.” (రోమీయులకు 5:3-4)
- క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థులు: “క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా సంతోషముతో ఉత్సహించునట్లు, ఆయన శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.” (1 పేతురు 4:13)
- వివిధ శోధనలు కలిగినప్పుడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి.” (యాకోబు 1:2-3)
- ప్రతీకారం వద్దు: “కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పునదేమనగా—దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచెంపను కూడా త్రిప్పుము.” (మత్తయి 5:38-39)
ఇవన్నీ పాటిస్తే ఎలాంటి సమస్య లేదు. అందరూ సంతోషంగా ఉండొచ్చు. కానీ క్రైస్తవులు కోపంతో ఊగిపోతున్నారు. క్రైస్తవ నాయకులు పోరాటం చేస్తాం అంటున్నారు. కొందరు youtube లో వీడియోలు కూడా చేస్తున్నారు. ఇవి యేసు చెప్పిన పద్ధతి అయితే కాదు.
3. మూడవ పద్ధతి (అంబేద్కర్ పద్ధతి): రాజ్యాంగబద్ధమైన పోరాటం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గం ఆధునిక సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా న్యాయం పొందడం.
- చట్టబద్ధమైన పోరాటం: అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం, కోర్టుల ద్వారా న్యాయం కోసం పోరాడటం.
- సంఘటితం అవ్వడం: “శిక్షించు, సంఘటించు, పోరాడు” అనే నినాదంతో బాధితులంతా ఏకమై శాంతియుతంగా తమ గళాన్ని వినిపించడం.
- మత సామరస్యం: రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు ఉంది. ఈ హక్కును కాపాడుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
చూస్తుంటే హిందువులు యెహోవా పద్ధతి పాటిస్తున్నారు. క్రైస్తవులు అంబేద్కర్ పద్ధతిలో న్యాయం కావాలి అంటున్నారు. యేసు మాటలను, బోధలను పక్కన పెట్టేశారు. నేను దీనిని కూడా బలంగా ఖండిస్తున్నాను.
ముగింపు:
మతోన్మాదానికి మతంతో సంబంధం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి సమయాల్లో మనం ప్రతీకారం కంటే ప్రార్థన చేయడం ఉత్తమం అని తెలుసుకోవాలి. అందరూ యేసు బోధలనే పాటించాలి అని నా విన్నపం.