నేనే కరుణామయుడిని… కానీ..
“నేను యెహోవాను / యేసును / పరిశుద్ధాత్మ పేరు ఏదైనా నేనే కరుణామయుడిని.”
కానీ నా భక్తిలో లేదా నా నియమాలలో ఏమాత్రం తేడా వచ్చినా నేనేం చెప్పానో ఈ క్రింద చదవండి:
- వేరే దేవుణ్ణి పూజిద్దామని సోదరుడు ప్రేరేపిస్తే? వెంటనే చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:6-10)
- మతం మారమని కూతురు ప్రేరేపిస్తే? ఏమాత్రం కనికరించకుండా చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:6-10)
- వేరే దేవుని వైపు వెళ్ళమని కొడుకు ప్రేరేపిస్తే? వెంటనే చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:6-10)
- మతం మారమని ప్రాణస్నేహితుడు చెబితే? జాలిపడకుండా చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:6-10)
- మతం మారమని నీ పెండ్లం ప్రేరేపిస్తే? కనికరం లేకుండా చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:6-10)
- నీ గ్రామంలో ఎవరైనా సూర్య చంద్రులకు నమస్కరిస్తే? వారిని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 17:2-5)
- ఎవరైనా నక్షత్రాలను పూజిస్తుంటే? రాళ్లతో కొట్టి వారిని చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 17:2-5)
- నీ గ్రామంలో ఎవరైనా వేరే దేన్నైనా పూజిస్తుంటే? ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 17:2-5)
- నీవు వెళ్ళే చోట అన్యుల బలిపీఠాలను, విగ్రహాలను చూస్తే? వాటిని పడగొట్టి, ఆ ప్రజలను చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 34:13)
- కొండల మీద, మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే? వాటిని బొత్తిగా పాడుచేసి, ఆ దేవతలను పూజించే వారిని చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 12:2)
- ఎవరైనా సోది చెబితే? వారిని సమాజంలో ఉండనివ్వకుండా చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 20:27)
- ప్రాయశ్చిత్తార్థ దినమున ఎవరైనా పని చేస్తే? ఆ మనుష్యులను చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 23:29-30)
- ఎవరైనా సూచక క్రియలు, మహత్యాలు చూపి మతం మారమంటే? ఆ ప్రవక్తను చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:1-5)
- వేరే దేవుని నామమున ఎవరైనా ప్రవచనం చెబితే? ఆ మనిషిని చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 18:20)
- తల్లిదండ్రులను ఎవరైనా కొడితే? ఏమాత్రం జాలి లేకుండా చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 21:15)
- తల్లిదండ్రులను ఎవరైనా దూషిస్తే? వారిని వెంటనే చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 20:9)
- యాజకుని లేదా పాస్టర్ మాట వినకపోతే? ఆ గర్వించిన మనిషిని చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 17:12)
- యెహోవాకు కాక వేరే దేవునికి బలి అర్పిస్తూ మతం మారితే? వారిని చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 22:20)
- ఎవరైనా వ్యభిచారం చేస్తే? ఏమాత్రం కనికరించకుండా చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 20:10)
- ఇశ్రాయేలీయుల దేవుని యొద్ద విచారణ చేయకపోతే? చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చంపేయమని చెప్పాను. (2 దినవృత్తాంతములు 15:12-13)
- ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటే? వారిని వెంటనే చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 21:9)
- ఎవరైనా తప్పుడు ప్రవచనం చెబితే? కన్న తల్లిదండ్రులే వారిని పొడిచి చంపేయమని చెప్పాను. (జెకర్యా 13:3)
- స్వలింగ సంపర్గానికి పాల్పడితే? వారిని అపవిత్రులుగా పరిగణించి చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 20:13)
- ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే? సమాజమంతా కలిసి రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 24:10-16)
- విశ్రాంతి దినమున ఎవరైనా పని చేస్తే? ఏమాత్రం కనికరం లేకుండా చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 31:12-15)
- విశ్రాంతి దినమున పొయ్యి వెలిగిస్తే? ఆ వ్యక్తిని చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 35:2-3)
- విశ్రాంతి దినమున ఎవరైనా కట్టెలు ఏరుకుంటే? రాళ్లతో కొట్టి వారిని చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము 15:32-36)
- సకాలంలో పస్కా పండుగ ఆచరించకపోతే? ఆ మనిషిని చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము 9:13)
- పండుగ రోజున పులిసిన రొట్టె తింటే? వారిని ప్రజల్లో నుండి కొట్టివేసి చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 12:15)
- మాంసంలోని క్రొవ్వును ఎవరైనా తింటే? వారిని వెంటనే చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 7:22-25)
- మాంసంలోని రక్తమును ఎవరైనా తింటే? వారిని ప్రజలలో ఉండనివ్వకుండా చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 7:26-27)
- ఎవరైనా సున్నతి చేసుకోకపోతే? ఆ పురుషుని చంపేయమని చెప్పాను. (ఆదికాండము 17:14)
- బలి ఇచ్చిన మాంసాన్ని ఆలస్యంగా తింటే? వారిని అపవిత్రులుగా ఎంచి చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 19:5-8)
- యాజకుడు లేకుండా ఎవరైనా బలి ఇస్తే? ఆ వ్యక్తిని చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 17:8-9)
- లేవీయులు కాని వారు బలిపీఠాన్ని సమీపిస్తే? వారిని అక్కడికక్కడే చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము18:3)
- పరిశుద్ధ స్థలాన్ని ఎవరైనా తదేకంగా చూస్తే? ఆ మనుష్యులను చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము 4:20)
- నారబట్టలు వేసుకోకుండా ఎవరైనా గుడిలోకి వస్తే? వారిని ఏమాత్రం కనికరించకుండా చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 28:42-43)
- హెచ్చరిక లేకుండా దైవదర్శనం చేస్తే? ఆ వ్యక్తిని వెంటనే చంపేయమని చెప్పాను. (నిర్గమకాండము 28:34-35)
- మందిరాన్ని యాజకులు కాకుండా వేరే వాళ్ళు సమీపిస్తే? వారిని చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము1:51)
- యాజకుడిని అనధికారికంగా సమీపిస్తే? ఆ పరాయి వాడిని చంపేయమని చెప్పాను. (సంఖ్యకాండము 3:10)
- బహిష్టు అయిన స్త్రీని ఎవరైనా సంభోగిస్తే? వారిద్దరినీ ప్రజలలో నుండి కొట్టివేసి చంపేయమని చెప్పాను. (లేవీయకాండము 20:18)
- పనికిమాలిన మనుషులు ఇతర దేవతలను పూజిద్దామని పట్టణాన్ని ప్రేరేపిస్తే? ఆ ఊరిని, అందలి పశువులను హతమార్చి అందరినీ చంపేయమని చెప్పాను. (ద్వితీయోపదేశకాండము 13:13-16)
నేను చెప్పడమే కాదు, కోట్ల మంది చావుకు కారణమయ్యాను. ఇవన్నీ నా గ్రంథంలోనే సాక్ష్యంగా ఉన్నాయి.
నేను కోట్ల మంది చావుకు కారణమైన కొన్ని చారిత్రక సాక్ష్యాలు:
- నోవహు కాలపు జలప్రళయం: లోకమంతా పాపంతో నిండిందని, నా చేతులతో నేను సృష్టించిన మనుషులను, జంతువులను, పక్షులను భూమి మీద ఉండకుండా జలప్రళయంతో తుడిచిపెట్టేశాను. కోట్ల మందిని చంపేశాను. (ఆదికాండము 7:21-23)
- పిల్లల మాంసం తినేలా చేయడం: నా ఆజ్ఞలు వినకపోతే, మీకు కలిగే కరువులో మీరు మీ స్వంత కుమారుల మాంసాన్ని, కుమార్తెల మాంసాన్ని తినేలా శిక్షించాను. అలా తినేలా చేశాను. (లేవీయకాండము 26:29, యిర్మియా 19:9, ద్వితీయోపదేశకాండము 28:53)
- పసిపిల్లలతో సహా అందరినీ హతమార్చడం: అమాలేకీయుల మీద దాడి చేసినప్పుడు పురుషులను, స్త్రీలను మాత్రమే కాదు… పసిపిల్లలను, పాలు కుడుచు బిడ్డలను, ఎడ్లను, గొర్రెలను, ఒంటెలను ఏమాత్రం కనికరించకుండా చంపేయమని చెప్పాను. (1 సమూయేలు 15:3)
- గర్భవతుల కడుపులు చీల్చడం: సమరయ వారు నా మీద తిరుగుబాటు చేసినందుకు, వారి శిశువులు నేలకేసి కొట్టబడేలా, వారి గర్భవతుల కడుపులు చీల్చబడేలా చంపేయమని చెప్పాను. (హోషేయ 13:16)
- ఐగుప్తులో తొలిచూలు బిడ్డల సంహారం: ఫరో నా మాట వినలేదని, ఐగుప్తు దేశమంతటా జంతువుల నుండి మనుషుల వరకు ప్రతి ఇంట్లో ఉన్న తొలిచూలు బిడ్డలందరినీ ఒక్క రాత్రిలో చంపేశాను. (నిర్గమకాండము 12:29-30)
- ఇంకా ఎన్నెన్నో చేశాను.
అయినా… నేనే కరుణామయుడిని!
“పోస్ట్ పూర్తిగా చదివి షేర్ చేయగలరు”