మానవ చరిత్రలో విగ్రహారాధన అనేది అత్యంత పురాతనమైన ఆచారం. నేడు హిందూ, బౌద్ధ, జైన మతస్తులే కాకుండా, క్రైస్తవత్వంలో కూడా దాదాపు 55% మంది వివిధ రూపాల్లో విగ్రహాలను, చిత్రపటాలను వాడుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక విశ్వాసులు విగ్రహారాధకులే. మన దేశంలో కూడా రోజు ఎక్కడో ఒక చోట ఒక కొత్త యేసు విగ్రహం వెలుస్తోంది.
మరి ఇలాంటి విగ్రహారాధనను బైబిల్ అంగీకరిస్తుందా? ఈ క్రింది బైబిల్ వాక్యాలను పరిశీలించండి:
విగ్రహారాధనపై బైబిల్ హెచ్చరికలు:
- జాగ్రత్త: “చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికిపోకుండ జాగ్రత్తగా ఉండుడి.” (1 యోహాను 5:21)
- దూరంగా ఉండండి: “నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి.” (1 కొరింథీయులకు 10:14)
- ఆజ్ఞ: “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.” (నిర్గమకాండము 20:4)
- దైవ మహిమ: “యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.” (యెషయా 42:8)
- విగ్రహాల వ్యర్థత: “వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు. వాటికి చెవులుండియు వినవు… వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచువారందరును వాటితో సమానులగుదురు.” (కీర్తనల గ్రంథము 115:4-8)
- నిర్మించే వారికి శ్రమ: “విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు… కర్రతో—మేలుకొమ్మనియు, మూగరాతితో—లెమ్మనియు చెప్పువానికి శ్రమ.” (యెషయా 44:9, హబక్కూకు 2:19)
- అంతిమ తీర్పు: “విగ్రహారాధకులును అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.” (ప్రకటన గ్రంథము 21:8)
ముగింపు: విగ్రహారాధన వద్దు అన్న మతాలు మళ్ళీ విగ్రహాలను ప్రోత్సహించడం మోసం మాత్రమే కాదు ఆత్మవంచన కూడా!