Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

Dark bible -1

(పరమగీతంలో శృంగారం -1)

చెల్లెలి అవయవాలు పెరగలేదని అన్నగారి ఆవేదన

సోలమన్ రాజు రచించినట్టు భావించబడే పరమగీతం (బైబిల్లో ఒక చాప్టర్) లో ఒక వచనంలో ఇలా రాయబడి ఉంటుంది.

మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము? (పరమగీతము 8:8)

తెలుగు బైబిల్ అనువాదం చదివే వారికి ఈ వచనం పెద్దగా ఇబ్బందికరంగా అనిపించదు. కానీ మూల గ్రంథం (హీబ్రూ బైబిల్ ) చదివితే అసలు విషయం బయట పడుతుంది.

హీబ్రూ బైబిల్ హీబ్రూ – ఆంగ్ల భాష సమాంతర అనువాదం ఇక్కడ చూడండి.

https://biblehub.com/interlinear/songs/8-8.htm

అక్కడ స్పష్టంగా breasts అనే పదం ఉంది. కానీ తెలుగులో అసలు ఆ పదాలే లేకుండా జాగ్రత్త పడ్డాడు తెలుగు అనువాదకుడు. మరీ ముఖ్యంగా wə·šā·ḏa·yim (וְשָׁדַ֖יִם) అనే పదానికి breast అనే ఉపయోగించాలి అని తెలియజేస్తుంది. ఈ క్రింది లింక్.

https://biblehub.com/hebrew/veshadayim_7699.htm

హీబ్రూ భాష వరకూ ఎందుకు ఆంగ్ల అనువాదాల్లో కూడా breasts అనే వాడారు.

We have a young sister, and her breasts are not yet grown. What shall we do for our sister for the day she is spoken for?

(Song of Songs 8:8) (English NIV)

“We have a little sister, and she hath no breasts; what shall we do for our sister in the day when she shall be spoken for? (Song of Songs 8:8) (English KJV)

కానీ తెలుగులో మాత్రం వక్షోజాలు అని అనలేదు. ఎందుకు?

ఎందుకు అంటే మన దేశంలో చెల్లెలి వక్షోజాల పెరుగుదల గురించి ఒక అన్నయ్య/అన్నయ్యలు మాట్లాడటం సమాజం హర్షించదు కాబట్టి.

2 thoughts on “Dark bible -1

Leave a Reply to Ramana Nationalist Cancel reply

Your email address will not be published. Required fields are marked *