Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

అన్యులను చంపించిన యెహోవా

అన్యులపై యెహోవా ద్వేషానికి ఈ నియమాలే సాక్ష్యం.

రేపిస్ట్ యొక్క వర్గాన్ని చూసి తీర్పులు చెప్పే యెహోవా.

రేపిస్ట్ ఇజ్రాయెల్ వాడు అయితే ఈ రూల్ వర్తిస్తుంది.

  1. ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు. (ద్వితీయోపదేశకాండము 22:28-29)
If a man happens to meet a virgin who is not pledged to be married and rapes her and they are discovered. He shall pay the girl’s father fifty shekels of silver. He must marry the girl, for he has violated her. He can never divorce her as long as he lives. (Deuteronomy 22:28-29)

2. ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను. (నిర్గమకాండము 22:16)

If a man seduces a virgin who is not pledged to be married and sleeps with her, he must pay the bride price, and she shall be his wife. If her father absolutely refuses to give her to him, he must still pay the bride price for virgins. (Exodus 22:16)

ఇక్కడ అమ్మాయి ఇష్టాయిష్టాలతో పని లేదు. తండ్రిదే నిర్ణయాధికారం. ఆమెను రేప్ చేసినవాడికి తండ్రకి డబ్బు/ పెళ్లి అని డిస్కషన్ రాయబడి ఉంది.

అదే రేపిస్ట్ అన్యుడు అయితే ..?

రూల్ చేంజ్ అవుతుంది. రక్తం ఏరులై పారుతుంది. అది ఎలాగో తెలియాలంటే ఈ కథ చదవండి.

Context:

ఒక అందమైన ప్రేమ కథ కావాల్సిన స్టోరీ ని రక్త చరిత్ర చేసిన యెహోవా

అన్యులతో పెళ్లి సంబంధాలు యెహోవాకు ఇష్టం వుండకపోవడమే ఇందుకు కారణమా?

అన్యుడైన రేపిస్ట్ /ప్రేమికుడు దీనా అనే ఇజ్రాయెల్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు?

అదే పని ఒక ఇజ్రాయెల్ వ్యక్తి చేసి ఉంటే యెహోవా ఏం చేసేవాడు?

మెయిన్ రిఫరెన్స్:

“మా పితరుడగు షిమ్యోను దేవుడవైన ప్రభూ! పూర్వము అన్యజాతివారు దీనా అను కన్యను వివస్త్రను చేసి మానభంగము చేసి, అవమానముపాలు చేయగా, నీవు షిమ్యోనును కత్తితో పంపి, అతడు వారిమీద పగతీర్చు కొనునట్లు చేసితివి.
యూదితు 9 : 2. (తెలుగు కాథలిక్ బైబిల్ )

O Lord God of my ancestor Simeon, to whom you gave a sword to take revenge on those strangers who had torn off a virgin’s clothing to defile her, and exposed her thighs to put her to shame, and polluted her womb to disgrace her; for you said, “It shall not be done”—yet they did it. Judith 9.2 (NRSV)

కథ:

దీనా ఒక ఇజ్రాయెల్ జాతి అమ్మాయి తన స్నేహితురాళ్లను చూడటానికి ఒక ప్రాంతానికి వెళుతుంది. అక్కడ హివ్వీయుడైన ఒక యువకుడు ఆమెను మానభంగం చేస్తాడు. కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ప్రేమ కూడా. తన తల్లి తండ్రులను ఒప్పించి, ఆ పిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని పంపిస్తాడు. సున్నతి చేసుకోని మీతో ఎలా వియ్యం అందుకోవాలి అని ఇజ్రాయెల్ వాళ్ళు అంటారు. అయితే సున్నతి చేసుకునే మీ పిల్లను పెళ్లి చేసుకుంటాం అని ఊరిలోని మగవాళ్లు అంతా పోయి సున్నతి చేసుకుని వస్తారు. పెళ్ళికి అంతా సిద్ధం అవుతుంది. కానీ ఆఖరిలో హఠాత్తుగా అంతా మారిపోతుంది. అమ్మాయి తాలూకా వాళ్ళు అబ్బాయి తాలూకా వాళ్ళని కత్తులతో దాడి చేసి చంపేస్తారు. అయితే ఆ కత్తిని యెహోవాయే అందించాడు అని బైబిల్ చెప్తోంది.

ఈ కథలో ఇజ్రాయెల్ వారికి ఉన్న ఏకైక సమస్య. అన్యులతో పెళ్లి.

ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను. (ఆదికాండము 34:2)

అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను. (ఆదికాండము 34:3-4)

తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను. (ఆదికాండము 34:5)

షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను. (ఆదికాండము 34:6)

అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి. (ఆదికాండము 34:8)

మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. (ఆదికాండము 34:9)

మరియు షెకెముమీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను. (ఆదికాండము 34:11)

ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను. (ఆదికాండము 34:12)

మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమాన మగును. (ఆదికాండము 34:14)

మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి;
ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. (ఆదికాండము 34:15-16)

మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా
వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. (ఆదికాండము 34:17-18)

ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు (ఆదికాండము 34:19)

ఆదికాండము 34:21
ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండ నిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.

ఆదికాండము 34:22
అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు.

ఆదికాండము 34:24
హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.

మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి. (ఆదికాండము 34:25)

ఆదికాండము 34:26
వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి

తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని
వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి. (ఆదికాండము 34:27-29)

FINAL TOUCH:

అందుకు వారు-వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి. (ఆదికాండము 34:31)

ఇజ్రాయెల్ వాళ్ళు రేప్ చేస్తే ఓలి కట్టి తప్పించుకోవచ్చు. లేదా పిల్ల తండ్రితో మాట్లాడి పెళ్లి చేసుకోవచ్చు. కానీ అన్యుడి విషయంలో అయితే ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టు గోల చేసి, ఆ పిల్లాడి ఫ్యామిలీని చంపేసి, ఆ ఊరు అంతా దోచుకుపోవచ్చు.

దీనిని బట్టి మీకు ఏం అర్ధం అయింది?

యెహోవా అన్యులను ఎలా ట్రీట్ చేశాడు?

Notes: reference about Jehovah’s Sword is taken from Judith’s chapter present only in the Telugu Catholic Bible

One thought on “అన్యులను చంపించిన యెహోవా

Leave a Reply to Kiran Cancel reply

Your email address will not be published. Required fields are marked *