
బైబుల్లో బైబిల్ దేవుని సర్వజ్ఞతను హేళన చేసే ఇంతకన్న గొప్ప వాక్యము మరొకటి లేదు !
ఆదికాండము 18:20
మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను #నేను #దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో #చూచెదను. చేయనియెడల #నేను #తెలిసికొందుననెను.
ఫలానా ఊర్లో మనుషులు పాపం చేశారని యేహోవాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంట! ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వారు పాపము చేసారో లేదో తెలుసుకునేందుకు పై నుండి కిందకు దిగిపోయి, చూసి తెలుసుకుంటాడంట!
సర్వజ్ఞుడైన దేవుడు కిందకు దిగి చూసి, తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి?
కిందకు దిగి కళ్లారా చూస్తేనే తప్ప తెలుసుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు?
ఇలాంటిదే మరో వాక్యం. ఇక్కడ దేవుడు నరులు కట్టిన గోపురాన్ని చూడటానికి పై నుండి దిగివచ్చాదంట. తాను ఉన్న స్థానం నుండి చూడలేని వాడు దేవుడు ఎలా అవుతాడు?
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. (ఆదికాండము 11:5)
But the LORD came down to see the city and the tower that the men were building. (Genesis 11:5)
ఆలోచించండి ప్రియులారా!
పాస్టర్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకండి.
దిగివచ్చి మనుషులు తాను ఊహించిన దాని కంటే ఉన్నతంగా దానిని నిర్మించినారని తెలుసుకొని ఆశ్చర్యంతో కూడిన అసూయతో కూడిన ద్వేషాన్ని ప్రదర్శిస్తాడు…అంటే అతను సర్వజ్ఞుడు కాదు అనిఈ వాక్యం నిరూపిస్తున్నది.
5 అయితే ప్రజలు నిర్మిస్తున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడడానికి యెహోవా దిగివచ్చాడు . 6 ప్రభువు ఇలా అన్నాడు, “ఒకే భాష మాట్లాడేవాళ్ళు ఇలా చేయడం మొదలుపెట్టారు, అప్పుడు వారు చేయాలనుకున్నది వారికి అసాధ్యం కాదు. 7 రండి, మనం దిగి వెళ్లి , వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా వాళ్ళ భాషని తికమక పెడదాం.”
8 కాబట్టి ప్రభువు వారిని అక్కడ నుండి భూమి అంతటా చెదరగొట్టాడు, మరియు వారు పట్టణాన్ని నిర్మించడం మానేశారు. 9 అందుకే దానికి బాబెల్ [ సి ] అని పేరు పెట్టారు -ఎందుకంటే అక్కడ ప్రభువు ప్రపంచమంతటి భాషను గందరగోళపరిచాడు . అక్కడ నుండి ప్రభువు వారిని భూమి అంతటా చెదరగొట్టాడు .
మరలా ఈ చిదరగొట్టిన వారిని ఏకం చేయడానికిఏసు ప్రయత్నించినందుకు యెహోవా అతనిని చంపించాడు!