చనిపోయిన యేసుని లేపింది యేసేనా?చనిపోయిన లాజరుని బతికించమని యేసు ప్రార్ధించింది యేసుకేనా?

నిన్న నేను పెట్టిన ప్రశ్నచనిపోయిన 4 రోజుల తరువాత లేచిన లాజరు గొప్పోడా?2.5 రోజుల తరువాత లేచిన యేసు గొప్పోడా? Just asking…..

దీనికి సమాధానంగా ఒక పెద్దాయన పెట్టిన సమాధానం అత్యంత హాస్యాస్పదంగా అనిపించింది నాకు.

ఆయన ఏమంటారు అంటే యేసు చనిపోయి తనకు తానుగా లేచాడు అని.. అలాగే లాజరుని యేసే లేపాడు అని… ఈ రెండూ పచ్చి అబద్ధాలు.

లాజరుని లేపింది యెహోవా.. యేసు కేవలం ప్రార్ధన మాత్రమే చేశాడు. అది కూడా యెహోవాకి అని bible చెప్తోంది. అలా కాకుండా చనిపోయిన యేసుని యేసే లేపినట్టు అయితే అది పిచ్చే అవుతుంది. చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తిని ఎలా లేపుతాడు? వినేవాళ్ళు vp లు అయితే ap మొత్తం నాదే అనే వాళ్ళు ఇలాంటి కథలని నమ్ముతారు.నిజానికి బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. యేసుని లేపింది యెహోవా అని. కానీ మా పెద్దాయన పచ్చి అబద్ధాలు చెప్పడానికే రెడీ అయ్యారు. కానీ ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు.

ఈ ఆధారాలు చూడండి.

యేసు లేచాడా? లేపబడ్డాడా?

దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును. (1 కోరింథీయులకు 6:14)

By his power God raised the Lord from the dead, and he will raise us also. (1 Corinthians 6:14)

ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. (2 కోరింథీయులకు 4:15)

All this is for your benefit, so that the grace that is reaching more and more people may cause thanksgiving to overflow to the glory of God. (2 Corinthians 4:15)

ఇలాంటి రిఫరెన్స్ బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అన్నిటి సారాంశం ఒక్కటే. యెహోవా అనే దేవుడు యేసు అనే దేవుడి మధ్యవర్తిని చనిపోయాక పైకి లేపాడు అని.

వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా.. ఆ గ్రంథంలో ఉన్నది అదే.

కానీ ఆ పెద్ద మనిషి యేసుని యేసే లేపుకున్నాడు అంటున్నారు. ఆయనకు నేను చెప్పేది ఒక్కటే… పిచ్చి అంటారు సార్ దీన్ని..!మా పెద్ద మనిషి చెప్పిన రెండో అబద్దంచనిపోయిన లాజరుని యేసే లేపాడుపెద్దాయన చెప్పేది ఎలా ఉంది అంటే యేసు తన శక్తితో చనిపోయిన లాజరుని లేపాడు అని. కానీ యేసు యెహోవాకి ప్రార్ధన చేసి లాజరుని బతికించమని బతిమాలినట్టు బైబిల్లో రాయబడి ఉంది.

యేసే నిజంగా లాజరుని లేపగలిగే శక్తి కలిగిన వాడు అయితే మరో క్యారెక్టర్ కి ప్రార్ధన చేయాల్సిన అవసరం ఏమిటి? తానే లే.. లే… లే.. అని లేపేసే వాడు కదా.. కానీ బైబిల్లో అలా లేదు.మరి ఎలా ఉంది?

యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. (యోహాను 11:38)

Jesus therefore again, groaning in Himself, came to the grave. It was a cave, and a stone lay against it. (John 11:38)

అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; (యోహాను 11:40)అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. (యోహాను 11:41)

నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. (యోహాను 11:42)

ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగాచనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. (యోహాను 11:43-44)

చూశారుగా చనిపోయిన లాజరు దగ్గరకి ఏడుపుగొట్టు మొఖం వేసుకోని, యెహోవా నా లాజరుని బతికించు అని యేసు ప్రార్ధన చేస్తే యెహోవా లాజరుని బతికించాడు అని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది.కానీ మా పెద్దాయన ఏమంటాడు? యేసు లాజరుని లేపాడు అంట..!

యేసే లాజరుని లేపితే యేసు యేసుకే ప్రార్ధన చేశాడా? ఒక వేళ ఇలా జరిగి ఉంటే పిచ్చంటారు సార్ దీన్ని కూడా…!!

!ఇక లాజరు నిజంగా లేచాడా? ఇదంతా డ్రామా నా? అనే విషయంపై నేను పాత పోస్టు ఒకటి ఉంది చూడగలరు.

https://ramananationalist.in/lazarus-raised-from-death-exposed/

1 thought on “చనిపోయిన యేసుని లేపింది యేసేనా?చనిపోయిన లాజరుని బతికించమని యేసు ప్రార్ధించింది యేసుకేనా?పిచ్చి అంటారు సార్ దీన్ని..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *