Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా నీతిమంతులను రక్షిస్తాడా? శిక్షిస్తాడా?

బైబిల్ దేవుడు యెహోవా పసిపిల్లలను ఎందుకు చంపాడు అన్న నా ప్రశ్నకు క్రైస్తవులు ఇచ్చిన సమాధానాలు 3 రకాలు

  1. దేవుడే మనుషులను సృష్టించాడు కాబట్టి వాళ్ళని చంపే హక్కు దేవుడికి ఉంది.
  2. అదంతా “దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” లో భాగంగా చేశాడు మా దేవుడు.
  3. నీకు కాంటెక్స్ట్ తెలియదు.

ఈ మూడు సమాధానాలకు నా కౌంటర్

  1. దేవుడే మనుషులను సృష్టించాడు కాబట్టి వాళ్ళని చంపే హక్కు దేవుడికి ఉంది.

దేవుడు “మనుషులను సృష్టించాడు కాబట్టి చంపే హక్కు కలిగి ఉంటాడు” అన్నది మంచి వాదనే. ఈ వాదన ద్వారా యెహోవా చేసిన లక్షలాది హత్యలను క్రైస్తవులు ఈజీ గా సమర్ధించుకోవచ్చు. జలప్రళయంలో మానవులందరినీ చంపేయడాన్ని కూడా సమర్ధించుకోవచ్చు. తప్పు చేస్తే మా దేవుడు తాట తీస్తాడు అనే వాళ్ళు ఈ వాదనను తీసుకురావడం సరైనదే. ఐతే ఇందులో ఒక చిక్కు ఉంది.

ఇలా మనుషులను చంపేసే దేవుడు మళ్ళీ కరుణామయుడు, అపార కరుణామయుడు అనే ట్యాగ్స్ తగిలించుకోవడానికి అనర్హుడు. అలాగే మా దేవుడూ పాపుల కొరకే చనిపోయాడు అనే వాదనకు ఈ “దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” అనే వాదనకు అస్సలు పొసగదు. చిన్న చిన్న తప్పులకే ప్రాణాలు తీసిన దేవుడు “పాపుల కోసం చనిపోయాడు” అని చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉంటుంది.

కాబట్టి “దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” చేసే యెహోవా మా దేవుడు అని నమ్మే వాళ్ళు పాపుల కోసం చనిపోయిన యేసుని దేవుడిగా ప్రచారం చెయ్యలేరు. పైగా యెహోవా, యేసు ఒక్కరే అని వాదించాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.

  1. అదంతా “దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” లో భాగంగా చేశాడు మా దేవుడు.

ఈ వాదన ప్రకారం బైబిల్ దేవుడు మంచి వాళ్ళని కాపాడటానికే చెడ్డ వాళ్ళని శిక్షించాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మంచి వాదనే. కానీ దీని ప్రకారం చెడ్డ వాళ్ళను మాత్రమే బైబిల్ దేవుడు చంపేవాడు. మంచి వాళ్ళని కాపాడే వాడు అని నిరూపించుకోవాల్సి వస్తుంది క్రైస్తవులు. ఇది క్రైస్తవులకు సాధ్యం కాదు. ఎందుకు అంటే బైబిల్ దేవుడు చెడ్డ వాళ్లనే కాదు. మంచి వాళ్ళని కూడా అనేక సార్లు చంపేశాడు.

ఈ రిఫరెన్స్ లు చూడండి.

నీతిమంతులను కూడా చంపేస్తాను అంటున్న యెహోవా

యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను. (యెహెఙ్కేలు 21:3)

నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. (యెహెఙ్కేలు 21:4)

“పసిబిడ్డని (దావీదు కొడుకుని) చంపేసిన యెహోవా”

గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. (2 సమూయేలు 12:15)

యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. ( 2 సమూయేలు 12:16)

ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. (
2 సమూయేలు 12:18)

పసిబిడ్డలని కూడా చంపేయండి:

కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను. (1 సమూయేలు 15:3)

ఇలా అనేక చోట్ల నీతిమంతులను, పసిపిల్లలను చంపుతానని యెహోవా చెప్పాడు. ఎందరో అమాయకులను చంపాడు.

కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే వాదన యెహోవా విషయంలో పొసగదు.

ఎందుకు అంటే యెహోవా “దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ” చేసే టైపు దేవుడు. అంటే చెడ్డవాళ్లను చంపడం పక్కన బెడితే మంచి వాళ్ళను కూడా లేపేసే టైపు దేవుడు యెహోవా.

ఏ పాపం చెయ్యని ఎందరినో వరదలో ముంచి చంపేశాడు యెహోవా.

మూడో వాదన: నీకు కాంటెక్స్ట్ తెలియదు

నాకు కాంటెక్స్ట్ తెలుసు. అందుకే అన్నిటి పైనా ఇంత వివరంగా పోస్టులు పెడుతున్నాను. ఐతే ఇది fb కాబట్టి కొంచెం పొడవు పెరగకుండా చూస్తున్నాను.

….

మరి ఇలా అమాయకులని చంపడం తప్పు కాదా ? నీతిమంతులను చంపడం వలన దేవుడికి చెడ్డ పేరు రాదా ?

వస్తుంది. ఒకసారి ఇదే విషయం మీద మోసే యెహోవాకు ఒక సలహా కూడా ఇచ్చాడు.

ఒకసారి యెహోవా కోపంలో తన మాట వినని అందరినీ చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు మోసే అలా చెయ్యడం భావ్యం కాదు, మీకు చెడ్డ పేరు వస్తుంది అని యెహోవాను వారిస్తాడు. తర్వాత తన ఆవేశం వలన జరగబోయింది ఘోరానికి ఎంతో సంతాపం చెందుతాడు. ఇలా సలహా ఇచ్చే వాళ్ళు లేకనే ఏమో యెహోవా నీతి మంతులను, పసిపిల్లలను చంపుకుంటూ పోయాడు. ఇంకా ఓపిక ఉంటే ఆ రెఫరెన్సెస్ కూడా చదవండి.

కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా..

(నిర్గమకాండము 32:10)

మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? (నిర్గమకాండము 32:11)

ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు (నిర్గమకాండము 32:12)

నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను (నిర్గమకాండము 32:13)

అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను (నిర్గమకాండము 32:14)

And the LORD repented of the evil which He thought to do unto His people. (Exodus 32:14)

post : God saves or kills the rightoeus ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *