“ఇద్దరు మనుషులని తోటలో బట్టలు లేకుండా తిప్పావు వాళ్ళు ಆ విషయం తెలుసుగానే అక్కడ నుండి గేంటేశావు.
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. (ఆదికాండము 2:25) అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు శతన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవు యెహో వా అతడు నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి పంపివేసెను. ఆదికాండము 3:22,23) వాళ్ళు ఒకవేళ మంచి-చెడుల జ్ఞానం పొందకుండా, అలాగే నగ్నంగా తిరుగుతూ ఉండిపోతే, వాళ్లని ఏదేను తోటలో నుండి బయటకు గెంటేసేవాడివా?”
బైబిల్ అనబడే గ్రంథంలో మొదటి కథ ఆదిలోనే అత్యంత రసవత్తరంగా ఉండి, పాఠకులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఈ కథలో దేవుడి పాత్రధారి ఇద్దరు మానవులని (ఒక పురుషుడిని, ఒక స్త్రీని) పుట్టిస్తాడు. అది కూడా నగ్నంగా. పసిపిల్లలు అనుకునేరు. పెద్దగానే. ఆలా అని వయసు గురుంచి ఎటువంటి రెఫరెన్సెస్ ఇవ్వలేదు.
బట్టలు లేకుండా ఉన్న ఆ ఇద్దరు అడవిలో పిచ్చి మొహాలు వేసుకొని తిరిగే వాళ్ళు. కానీ వాళ్ళకి సిగ్గు అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు దిగంబరంగా ఉండేవారు అని బైబిల్ చెప్పకనే చెప్తుంది.
అప్పుడు ఆదామును, అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. (ఆదికాండము 2:25).
నగ్నంగా ఉన్నామన్న స్పృహ వాళ్ళకి లేదు. ఎందుకు అంటే ఆ విషయం వాళ్ళకి దేవుడు అనబడే పాత్ర తెలియజేయలేదు. సరికదా , ఆ పని చేసిన సైతానుని తిట్టిపోసి, శాపనార్ధాలు పెట్టి, తర్వాత ఈ మనుషులకి కూడా తిట్లు శాపనార్ధాలు పెట్టి అక్కడ నుండి తరిమేస్తాడు.
అసలు ఎందుకు తరిమేశాడు అంట?
మనిషి చావాలి అన్నది ఆయన పన్నాగం. ఇక్కడే ఉంటే కలకలం బతికేస్తాడు అని చెప్పి అక్కడ నుండి ఆ తోటలో నుండి తరిమేశాడు.
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. (ఆదికాండము 3:22,23)
ఇలా మొదటి మనిషి, అతని భార్య చనిపోవాలి అని కోరుకున్న ఈ దేవుడి పాత్ర మళ్ళీ మనిషిగా జన్మించి వీళ్ళ కోసమే చనిపోయింది అన్నది మరో కథ!
విచిత్రం కదా !
మనుషులు చావాలి అని కోరుకున్న దేవుడు, ఆ మానవుల కోసం చనిపోవడం .. వినడానికి నమ్మడానికి జనం ఏమైనా పండు తినని ఆదాము, హవ్వ లాగా అజ్ఞానులా? ప్రశ్నించే జ్ఞానులా అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న.
మరో విషయం, ఒక వేళ ఆదాము హవ్వ ఆ జ్ఞాన్ ఫలం తినకుండా , తోటలో బట్టలు లేకుండా కను విందు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ దేవుడి పాత్ర వాళ్ళని అక్కడ నుండి గెంటేసే వాడా?